Janasena | గోదావరిని చుట్టేద్దామా..! పవన్‌ కల్యాణ్‌ వారాహి మలివిడత యాత్రకు రెడీ

Janasena | ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోని ఒక్క సీట్ నూ జగన్ కు వదిలేది లేదని, మొత్తం తామే చుట్టబెడతాం అని శపథం చేసి కంకణం కట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత మళ్ళీ వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. మొదటి విడత ఈస్ట్ గోదావరిలో తిరిగిన ఆయన. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులను బట్టలు విప్పి సంకెళ్లు వేసి కొట్టుకుంటూ రోడ్డు మీద నడిపిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రలో కాక రేపాయి. ప్రతిగా […]

  • By: krs    latest    Jul 07, 2023 3:00 PM IST
Janasena | గోదావరిని చుట్టేద్దామా..! పవన్‌ కల్యాణ్‌ వారాహి మలివిడత యాత్రకు రెడీ

Janasena |

ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోని ఒక్క సీట్ నూ జగన్ కు వదిలేది లేదని, మొత్తం తామే చుట్టబెడతాం అని శపథం చేసి కంకణం కట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత మళ్ళీ వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. మొదటి విడత ఈస్ట్ గోదావరిలో తిరిగిన ఆయన. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులను బట్టలు విప్పి సంకెళ్లు వేసి కొట్టుకుంటూ రోడ్డు మీద నడిపిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రలో కాక రేపాయి. ప్రతిగా వైసిపి నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు మళ్లీ వారాహి యాత్రలో పవన్ ఏమి చేస్తారో.. ఎలాంటి ప్రకటనలు చేస్తారో అని జనం.. జన సైనికులు చూస్తున్నారు . ఈ నెల 9న ఏలూరు నుంచి మొదలయ్యే ఈ యాత్ర పదిహేను రోజులపాటు దెందులూరు, తాడేపల్లిగూడెం తణుకు ఉంగుటూరు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. పలు కీలక నియోజకవర్గాల్లో సాగే యాత్రలో భాగంగా ఆయన పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.


కాపుల ప్రాబల్యం ఎక్కువ ఉండే గోదావరి జిల్లాల్లో పట్టు సాధించడం..గ్రాఫ్ పెంచుకోవడం ద్వారా సాధ్యమైనన్ని సీట్లు గెలవడం.. లేదా టీడీపీతో పొత్తు ఉంటే ఎక్కువ సీట్లు డిమాండ్ చేసేలా వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల వరకూ వచ్చేసరికి తమకు టిడిపి సీట్లు ఇవ్వడం కాదని, తామే టిడిపికి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నది పవన్ వ్యూహం అని చెబుతున్నారు. అక్కడ కనీసం పాతిక ఇరవై సీట్లు గెలిస్తే.. రాష్ట్రంలో ఒకవేళ హాంగ్ ఏర్పడితే తాము కీలకపాత్ర పోషించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.