Janasena | రేపట్నుంచి విశాఖలో వారాహి యాత్ర
Janasena విధాత : గోదావరి జిల్లాల్లో సక్సెస్ అయిన వారాహి యాత్ర ఇప్పుడు విశాఖవైపు సాగనున్నది. గురువారం. ఆగస్టు 10 నుంచి విశాఖ నగరంలో వారాహి యాత్ర చేపట్టేందుకు జనసేనాని పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అయన సకల ఏర్పాట్లు, ఇంకా రూట్ మ్యాప్ సైతం రెడీ చేశారు. గోదావరి జిల్లా తరువత పార్టీకి ఎక్కువ ఊపు ఉందని చెప్పుకునేది విశాఖలోనే. మొన్న వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడి జనసేనలో చేరిన […]

Janasena
విధాత : గోదావరి జిల్లాల్లో సక్సెస్ అయిన వారాహి యాత్ర ఇప్పుడు విశాఖవైపు సాగనున్నది. గురువారం. ఆగస్టు 10 నుంచి విశాఖ నగరంలో వారాహి యాత్ర చేపట్టేందుకు జనసేనాని పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అయన సకల ఏర్పాట్లు, ఇంకా రూట్ మ్యాప్ సైతం రెడీ చేశారు.
గోదావరి జిల్లా తరువత పార్టీకి ఎక్కువ ఊపు ఉందని చెప్పుకునేది విశాఖలోనే. మొన్న వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడి జనసేనలో చేరిన నేపథ్యంలో అయన పెందుర్తి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. గతంలో పీఆర్పీ తరఫున పెందుర్తిలో గెలిచిన పంచకర్ల మళ్ళీ అక్కడ జనసేన తరఫున బరిలోకి దిగి గెలుస్తారని నమ్మకంతో ఉన్నారు.
మరోవైపు విశాఖలో పవన్ కు ఆశాజనకంగా ఉంటుందని సర్వేలు, ఇంకా పార్టీ అంతర్గత నివేదికలు చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పుడు తన బలం చూపనున్నారు. వలంటీర్ల మీద, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద,, ఇంకా నేరుగా జగన్ను ఏయ్.. జగన్ అంటూ చెలరేగిపోయిన పవన్ ఇప్పుడు విశాఖలో ఏమి మాట్లాడతారో ? ఎలా యాత్ర చేస్తారో అని ఆత్రుత జనంలో ఉంది.
మరోవైపు జనసేనకు విశాఖ, విజయనగరం, నెల్లిమర్ల ఇలా కొన్ని ప్రాంతాల్లో కాస్త పట్టు ఉందని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర ఆ ప్రాంతంలో మరింత ఊపు తెస్తుందని ఆశిస్తున్నారు. విశాఖలో సైతం కొన్ని సీట్లల్లో పోటీ చేయాలనీ ఆశిస్తున్న జనసేన ఇక్కడ తన బలాన్ని పెంచుకునేందుకు పథకాలు సిద్ధం చేస్తోంది.
మరోవైపు చిరంజీవిని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద నాగబాబు విమర్శల దాడి చేసారు. తన అన్నాను విమర్శించే స్థాయి మీకు లేదని, ఆయనతో ఫోటో కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఇప్పుడు చిరును విమర్శిస్తున్నారని అయన ఎద్దేవా చేసారు. సినిమా వాళ్ళు నిజాయితీగా వ్యాపారం చేస్తారని, టాక్సులు కడతారని అన్నారు.