RC16 Movie | రాంచరణ్ ఆర్‌సీ16 సినిమాలో హీరోయిన్‌గా జాన్వీకపూర్ ఫిక్స్..! ప్రకటించిన మేకర్స్..!
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది

RC16 Movie | ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది. జాన్వీ కపూర్ పట్టిన రోజున ‘ఆర్‌సీ16 మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటించనున్నట్లు పేర్కొంది. ‘హ్యాపీ బర్త్ డే జాన్వీ కపూర్ మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ నటించనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నది.
అయితే, రామ్‌చరణ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందని జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయనున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉన్నది. ప్రస్తుతానికి ఆర్‌సీ16 సినిమాకు సంబంధించి నటీనటులను ఎంపిక చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.
ఈ చిత్రంలో సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి సైతం ఈ చిత్రంలో నటించనున్నారు. ఇదిలా ఉండగా.. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘జగదేకవీరుడు.. అతిలోకసుందరి’ సినిమా భారీగా హిట్ సాధించింది. ఈ చిత్రం సైతం అదే రేంజ్‌లోనే ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ చివరిసారిగా బావల్ చిత్రంలో కనిపించింది. దేవరతో పాటు మిస్టర్ అండ్ మిస్సెస్ మహి, ఉలాజ్ చిత్రాల్లో నటిస్తున్నది.