ఏపీ CSగా జవహర్ రెడ్డి..! త్వరలో ఉత్తర్వులు
విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి కీలకమైన ప్రధాన కార్యదర్శి పోస్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియామకం కానున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా పని చేస్తున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ప్రబలిన రోజుల్లో వైద్యశాఖకు కమిషనర్ గా ఉన్న ఆయన మొత్తం యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకం.. బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాలు మందులు..ఇతర వైద్య మౌలిక సదుపాయాలు పెంచడంలో ఆయన కీలకంగా […]

విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి కీలకమైన ప్రధాన కార్యదర్శి పోస్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియామకం కానున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా పని చేస్తున్నారు.
2020, 2021 సంవత్సరాల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ప్రబలిన రోజుల్లో వైద్యశాఖకు కమిషనర్ గా ఉన్న ఆయన మొత్తం యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకం.. బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాలు మందులు..ఇతర వైద్య మౌలిక సదుపాయాలు పెంచడంలో ఆయన కీలకంగా పని చేసి, అందరి మెప్పు పొందారు.
ఆ తరువాత కొన్నాళ్లు టీటీడీపీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం సీఎంఓలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత ప్రధాన కర్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరో ఏడాది పాటు ఆయన సేవలు వాడుకోవచ్చు కానీ ఆయన ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ఆయన సర్వీసులో కొనసాగేందుకు ఇష్టపడడం లేదని సమాచారం.
ఈ పోస్టులో మరో సీనియర్ అధికారి శ్రీలక్ష్మికి అవకాశం ఉండొచ్చు, కానీ ఆమె రేసులో వెనకబడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కడప జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. డీజీపీ, చీఫ్ సెక్రటరీ సారథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరుగుతాయి అని అందరూ అనుకుంటున్నారు.