జీవో 58,59 స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పెంపు

విధాత: రాష్ట్ర ప్రభుత్వం జీవో 58,59 కింద స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పెంచింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు గడువును మరో నెల రోజులు పెంచుతూ.. ఈ మేరకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవడానిక అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ వర్తించే కటాఫ్‌ తేదీని కూడా 2020 జూన్‌ 2 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా […]

  • By: krs    latest    Mar 18, 2023 1:56 AM IST
జీవో 58,59 స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పెంపు

విధాత: రాష్ట్ర ప్రభుత్వం జీవో 58,59 కింద స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పెంచింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు గడువును మరో నెల రోజులు పెంచుతూ.. ఈ మేరకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవడానిక అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ వర్తించే కటాఫ్‌ తేదీని కూడా 2020 జూన్‌ 2 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మార్పులు చేసింది.

జీవో 76 కింద సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంచింది. దరఖాస్తుల గడువు మరో 3 నెలలు పొడిగించింది. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ వర్తించే కటాఫ్‌ తేదీ 2020 జూన్‌ 2 గా మార్పు చేసింది.

ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని సింగరేణి స్థలాల్లో ఆక్రమణలను ప్రభుత్వం క్రమబద్ధీకరించనున్నది.