ఏపీలోని 45 నగరాలకు జియో ఎయిర్‌ఫైబర్ సేవలు విస్తరణ..!
ఏపీలోని జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరిస్తున్నట్లు రిలయన్స్ కంపెనీ తెలిపింది. ఇండ్లు, వ్యాపార సంస్థలను అనుసంధానం చేయనున్నట్లు పేర్కొంది

విధాత: ఏపీలోని జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరిస్తున్నట్లు రిలయన్స్ కంపెనీ తెలిపింది. ఇండ్లు, వ్యాపార సంస్థలను అనుసంధానం చేయనున్నట్లు పేర్కొంది. ఏపీలోని 45 నగరాల్లో సేవలు అందించనున్నామని చెప్పింది. ఈ నగరాల్లోని అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ఇప్పుడు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందిస్తున్నామని పేర్కొంది.
సేవల విస్తరణతో ఆయా నగరాలన్నింటిలో జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జియో ఏపీ సీఈవో మహేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండ్లు, వ్యాపార సంస్థలు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందగలగుతారన్నారు. ఈ మైలురాయి డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌కు గణనీయమైన మెరుగుదలని సూచిస్తుందని.. జియో ఎయిర్‌ఫైబర్ సేవల విస్తరణ రాష్ట్ర యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించేందుకు జియో నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందన్నారు.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన విషయానికి వస్తే రూ.599కి 30 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను, రూ.899, రూ.1199కి 100 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్‌లను అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్లాన్‌లన్నీ 550ప్లస్ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్స్ అందుతాయన్నారు. 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రూ. 599, రూ. 899 ప్యాకేజీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రూ. 1,99 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియంతో సహా 16 ప్లస్ ప్రముఖ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుందని చెప్పారు. జియో ఎయిర్‌ఫైబర్.. జియో ఫైబర్ మాదిరిగానే అత్యుత్తమ సేవలను అందిస్తుందని వివరించారు.