జ‌మ్ముక‌శ్మీర్‌: గంట‌ల వ్య‌వ‌ధిలో వరుస బాంబు పేలుళ్లు(video)

విధాత: గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌మ్ముక‌శ్మీర్‌లో జ‌రిగిన రెండు బాంబు పేలుళ్లపై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఉధంపూర్‌లో కేవ‌లం 8 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో బ‌స్సుల్లో బాంబులు పేల‌డం క‌ల‌క‌లం సృష్టించింది. బుధ‌వారం రాత్రి ప‌ది గంట‌ల‌కు దొమైల్ చౌక్‌లో పార్క్ చేసిన బ‌స్సులో పేలుళ్లు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే తెల్ల‌వారు జామున 5.40 నిమిషాల ప్రాంతంలో ఉధంపూర్ బ‌స్టాండ్‌లో పేలుళ్లు జ‌రిగింది. ఈ […]

  • By: krs    latest    Sep 29, 2022 8:31 AM IST
జ‌మ్ముక‌శ్మీర్‌: గంట‌ల వ్య‌వ‌ధిలో వరుస బాంబు పేలుళ్లు(video)

విధాత: గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌మ్ముక‌శ్మీర్‌లో జ‌రిగిన రెండు బాంబు పేలుళ్లపై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఉధంపూర్‌లో కేవ‌లం 8 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో బ‌స్సుల్లో బాంబులు పేల‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

బుధ‌వారం రాత్రి ప‌ది గంట‌ల‌కు దొమైల్ చౌక్‌లో పార్క్ చేసిన బ‌స్సులో పేలుళ్లు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే తెల్ల‌వారు జామున 5.40 నిమిషాల ప్రాంతంలో ఉధంపూర్ బ‌స్టాండ్‌లో పేలుళ్లు జ‌రిగింది. ఈ ఘ‌ట‌నలోనే బ‌స్సు ధ్వంస‌మవగా ఎవ‌రికీ ప్ర‌మాదం జ‌రుగ‌లేదు.

అయితే ఈ వ‌రుస పేలుళ్ల‌పై అప్ర‌మ‌త్త‌మైన సైన్యం, పోలీస్ ఉన్న‌తాధికారులు క్లూస్ టీం, బాంబ్ స్వాడ్‌తో ఉధంపూర్‌లో గాలింపు చేప‌ట్టాయి. ఈ ఘ‌ట‌న వెనుక గ‌ల కార‌ణాలు క‌నుక్కోవ‌డానికి య‌త్నిస్తున్న‌ట్టు ఉధంపూర్ రేంజ్ డీఐజీ వెల్ల‌డించారు.