కాంట్రాక్టు వచ్చిన తర్వాతే రాజగోపాల్ బీజేపీలో చేరారు: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. రూ.21 వేల కోట్ల లబ్ధిపొందే కాంట్రాక్టు వచ్చిన తర్వాతే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు తాము ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదని, వారంతా నియోజక వర్గాల అభివృద్ధి కోసమే పార్టీలోకి వచ్చారని తెలిపారు. తన స్వార్థం […]

విధాత: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. రూ.21 వేల కోట్ల లబ్ధిపొందే కాంట్రాక్టు వచ్చిన తర్వాతే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని విమర్శించారు.
టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు తాము ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదని, వారంతా నియోజక వర్గాల అభివృద్ధి కోసమే పార్టీలోకి వచ్చారని తెలిపారు. తన స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానం ఖాయమని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ను లేకుండా చేసిందన్నారు. గత 8 ఏళ్లుగా ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. నల్లధనం దాచుకునే దొంగలకు బీజేపీ పార్టీ నిలయంగా మారిందని ఆరోపించారు.
దేశ ప్రజలను మోసం చేస్తున్న మోడీ గురించి అన్ని విషయాలను బహిరంగ సభ ద్వారా కేసీఆర్ వివరిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారని, మునుగోడు సభతోనే ప్రజాభిప్రాయం స్పష్టమవుతుందని మంత్రి తెలిపారు.