తారక రత్న కోసం ఆసుపత్రికి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్…కన్నీళ్లు ఆపుకుంటూ

తన సోదరుడు తారక రత్న ను పరామర్శించేందుకు బెంగళూరు లోని నారాయణ ఆస్పత్రికి వచ్చిన జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ కన్నీళ్లు ఆపుకుంటూ బాధను అణుచుకుంటూ అక్కడ కదలాడారు. వారిద్దరూ డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో ఆచితూచి మాట్లాడారు. ఈ నెల 27న తన అన్న తారకరత్న ఆసుపత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఆశలు మాత్రం వదులుకోవడం లేదు అని జూనియర్ చెప్పారు. వాస్తవానికి తన సోదరుడు అనారోగ్యం గురించి […]

  • Publish Date - January 29, 2023 / 10:45 AM IST

తన సోదరుడు తారక రత్న ను పరామర్శించేందుకు బెంగళూరు లోని నారాయణ ఆస్పత్రికి వచ్చిన జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ కన్నీళ్లు ఆపుకుంటూ బాధను అణుచుకుంటూ అక్కడ కదలాడారు.
వారిద్దరూ డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో ఆచితూచి మాట్లాడారు.

ఈ నెల 27న తన అన్న తారకరత్న ఆసుపత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఆశలు మాత్రం వదులుకోవడం లేదు అని జూనియర్ చెప్పారు. వాస్తవానికి తన సోదరుడు అనారోగ్యం గురించి మాత్రమే మాట్లాడిన జూనియర్ కనీసం టిడిపి పాదయాత్ర గురించి కనీసం ప్రస్తావించలేదు.

బాలయ్యబాబు కూడా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తో కలసి వచ్చి మాట్లాడుతూ శివరాజ్ కుమార్ పరామర్శకు రావడం తమకు కొండంత బలం అని చెప్పారు. జూనియర్ ఎన్టీయార్, బాలయ్యబాబు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

మొత్తానికి ఎన్టీయార్ కుటుంబీకులంతా.. పురంధేశ్వరి తదితరులు నిన్ననే ఆస్పత్రికి వచ్చి పరామర్శించగా నేడు జూనియర్ విడిగా వచ్చి సోదరుడు తారక రత్నను పరామర్శించారు. ఎక్కడా రాజకీయ ప్రస్తావన కానీ..టిడిపి.. పాదయాత్ర అనే మాట లేకుండా జాగ్రత్త పడుతూ రెప్పల మాటున బాధను దాస్తూ మీడియాతో మాట్లాడారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. రేపటికి కుదురుకుంటుంది అని భావిస్తున్నారు