మా పార్టీలో చేరమంటే 25కోట్లు అడిగాడు.. మంద కృష్ణపై కేఏ పాల్ ఆరోపణలు

మా పార్టీలో చేరమంటే 25కోట్లు అడిగాడు.. మంద కృష్ణపై కేఏ పాల్ ఆరోపణలు

విధాత : మా ప్రజాశాంతి పార్టీలో చేరమంటే 25 కోట్లు మందకృష్ణ మాదిగ 25కోట్లు అడిగాడని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మాదిగల విశ్వరూప సభ పెట్టేందుకు మందకృష్ణ మాదిగకు 72 కోట్లు ముట్టాయని, ఆయన బీజేపీకి అమ్ముడు పోయారని కేఏ పాల్ విమర్శించారు. అందుకే గతంలో మోడీని విపరీతంగా తిట్టిన మంద కృష్ణ ఇప్పుడు దేవడంటున్నారన్నారు. నరేంద్ర మోడీ బీసీ కాదని, మోడీ నా శిష్యుడని వ్యాఖ్యానించారు.


నరేంద్ర మోడీ సర్టిఫికెట్లు అన్నీ డూప్లికేట్ అని, నరేంద్ర మోడీకి కేఏ పాల్ భయపడబోడన్నారు. ఆదాని అప్పులను మోడీ కట్టకుండా మాఫీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మా పార్టీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయిలేదని దీనిపై హైకోర్టుకు వెలుతామన్నారు. ప్రజలు బీజేపీ, బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ప్రజలు ఓట్లు వేయకుండా ఈనెల 30వ తేదీన పోలింగ్ రోజున ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఒక్కడితోనే సాధ్యమన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన ప్రజలకు వద్దన్నారు.