Kajal Aggarwal:కాజ‌ల్ ముద్దులు, హ‌గ్గుల స్టోరీ వింటే మ‌తిపోవ‌ల్సిందే..!

Kajal Aggarwal: కలువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ అందం గురించి ఎంత చెప్పిన త‌క్కువే. చంద‌మామ లాంటి క‌ళ్లు, ఆక‌ర్షించే అందం ఆమె సొంతం. పెళ్లైన త‌ర్వాత కూడా దూసుకుపోతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్‌గా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సెష‌న్‌లో అభిమానులు అడిగిన అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. త‌మ‌న్నా, స‌మంత‌, ర‌కుల్‌ల‌తో స్నేహం గురించి ఓ నెటిజ‌న్ అడ‌గ‌గా, వారిని నిబ‌ద్ధ‌త‌, వ్య‌క్తులుగా, సెల్ఫ్ మేడ్ వ్య‌క్తులుగా […]

  • By: sn    latest    Jul 03, 2023 3:38 AM IST
Kajal Aggarwal:కాజ‌ల్ ముద్దులు, హ‌గ్గుల స్టోరీ వింటే మ‌తిపోవ‌ల్సిందే..!

Kajal Aggarwal: కలువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ అందం గురించి ఎంత చెప్పిన త‌క్కువే. చంద‌మామ లాంటి క‌ళ్లు, ఆక‌ర్షించే అందం ఆమె సొంతం. పెళ్లైన త‌ర్వాత కూడా దూసుకుపోతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్‌గా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సెష‌న్‌లో అభిమానులు అడిగిన అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. త‌మ‌న్నా, స‌మంత‌, ర‌కుల్‌ల‌తో స్నేహం గురించి ఓ నెటిజ‌న్ అడ‌గ‌గా, వారిని నిబ‌ద్ధ‌త‌, వ్య‌క్తులుగా, సెల్ఫ్ మేడ్ వ్య‌క్తులుగా అభివ‌ర్ణించింది. వారి ముగ్గురితో స్నేహం చాలా ఇష్టం. షూటింగ్ లేని స‌మ‌యంలో ముగ్గురం స‌ర‌దాగా క‌లిసేవాళ్లం. వారిని క‌లిసి మాట్లాడ‌డం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

ఇక మ‌రో నెటిజ‌న్.. మార్నింగ్‌ లేవగానే మీరు చేసే మొదటి పని ఏంటి అని అడిగారు. దీనికి స్పందించిన కాజల్ .. లేవ‌గానే నేను మొద‌ట నా కుమారుడికి, నా భర్తకి హగ్‌తోపాటు కిస్‌ ఇస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ప్ర‌శాంత‌మైన మ్యూజిక్ విన‌డం, ప్రే చేయ‌డం, న్యూస్ పేప‌ర్స్ చ‌ద‌వ‌డం, నీల్‌కి టిఫిన్ రెడీ చేసి తినిపించ‌డం, ప‌ని ఉన్న‌ప్పుడు త్వ‌ర‌గా రెడీ అయి షూటింగ్‌కి వెళ్ల‌డం వంటివి చేస్తాను అని కాజ‌ల్ చెప్పుకొచ్చింది. పెళ్లైన త‌ర్వాత కూడ కాజ‌ల్ సినిమాల‌తో దూసుకుపోతుంది. తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి అనే చిత్రం చేస్తుండ‌గా, ఇందులో శ్రీలీల కూడా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల కాజ‌ల్, శ్రీలీల క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రం ద‌స‌రాకి విడుద‌ల కానుంది.

మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియాన్ 2 అనే చిత్రం కూడా చేస్తుంది కాజ‌ల్. మ‌రోవైపు తన కుమారుడు నీల్‌ కిచ్లుని చూసుకుంటూ ఫ్యామిలీని లీడ్‌ చేస్తుంది. ఇక భర్త వ్యాపారాలను కూడా లీడ్‌ చేస్తుంది. ఇటీవ‌ల కాజ‌ల్ కొత్త బిజినెస్‌లు కూడా మొద‌లు పెట్టింది. పెళ్లైన త‌ర్వాత చాలా బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటుంది మిత్ర‌వింద‌.