Himanshu | ద‌శాబ్ది వేడుక‌ల్లో క‌ల్వ‌కుంట్ల హిమాన్షు.. తాత కేసీఆర్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా విన్న మ‌నుమ‌డు

Himanshu | తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ వేడుకల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ వేడుక‌ల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ అధికారులు, పోలీసు అధికారులతో పాటు మేధావులు పాల్గొన్నారు. ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు కూడా త‌న స్నేహితుల‌తో క‌లిసి ద‌శాబ్ది వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యాడు. రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ ఎంపీలకు కేటాయించిన వెనుక వ‌రుస‌లో హిమాన్షు త‌న […]

Himanshu | ద‌శాబ్ది వేడుక‌ల్లో క‌ల్వ‌కుంట్ల హిమాన్షు.. తాత కేసీఆర్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా విన్న మ‌నుమ‌డు

Himanshu |

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ వేడుకల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ వేడుక‌ల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ అధికారులు, పోలీసు అధికారులతో పాటు మేధావులు పాల్గొన్నారు.

ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు కూడా త‌న స్నేహితుల‌తో క‌లిసి ద‌శాబ్ది వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యాడు. రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ ఎంపీలకు కేటాయించిన వెనుక వ‌రుస‌లో హిమాన్షు త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆసీనుల‌య్యారు.

వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించిన హిమాన్షు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇక తన తాత కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్ర‌సంగం చేస్తుంటే.. హిమాన్షు ఆస‌క్తిగా విన్నారు. త‌న ఫ్రెండ్స్ కూడా కేసీఆర్ స్పీచ్‌లో లీన‌మైపోయారు.

ఇటీవ‌లే క‌ల్వ‌కుంట్ల హిమాన్షు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం, యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే.