న్యూజిలాండ్‌లో ముగిసిన కన్నప్ప షూటింగ్‌

హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కాగా చిత్ర బృందం ఇండియాకు తిరుగు ప్రయాణమైంది

  • By: Somu    latest    Dec 23, 2023 11:45 AM IST
న్యూజిలాండ్‌లో ముగిసిన కన్నప్ప షూటింగ్‌
  • ఇండియాకు తిరిగొస్తున్న చిత్ర బృందం


విధాత : హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కాగా చిత్ర బృందం ఇండియాకు తిరుగు ప్రయాణమైంది. ఈ విషయాన్నిసీనియర్ హీరో మోహన్‌బాబు ట్వీట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.


న్యూజిలాండ్‌లో 600 మంది హాలీవుడ్ సిబ్బందితో, భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’.


మొదటి షెడ్యూల్ 90 రోజులు న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో పూర్తయినట్లుగా మోహన్‌బాబు ట్వీట్ చేశారు. అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నామని అక్కడి లోకేషన్‌లో కూర్చున్న తన ఫోటోతో ట్వీట్‌లో పేర్కోన్నారు