మెదక్: కన్నుల పండువగా వైకుంఠ ద్వారం దర్శనాలు…

సిద్దిపేటలో వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు బంగారు కిరీటం బహూకరించిన మంత్రి.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు సిద్దిపేట,మెదక్,సంగారెడ్డి జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.. సిద్దిపేట శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన మంత్రి హరీష్ రావు  విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి […]

  • By: krs    latest    Jan 02, 2023 9:14 AM IST
మెదక్: కన్నుల పండువగా వైకుంఠ ద్వారం దర్శనాలు…
  • సిద్దిపేటలో వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు
  • బంగారు కిరీటం బహూకరించిన మంత్రి..
  • ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
  • సిద్దిపేట,మెదక్,సంగారెడ్డి జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు..
  • సిద్దిపేట శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన మంత్రి హరీష్ రావు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిద్దిపేటలో పాత వెంకటేశ్వరస్వామి ఆలయంలో వేంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం బహూకరించారు. ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జిల్లా కేంద్రమైన మెదక్‌లో రామాలయం,వెంకటేశ్వర ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. ఉదయం వేకువజామున ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు పల్లకి సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కంచి మధు అధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి లను సన్మానించారు.

రామాలయంలో అధ్యక్షులు నరేందర్ అధ్వర్యంలో వారిని సన్మానిచారు. భక్తులు బారులు తీరి దర్శనాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఏడుపాయల వన దుర్గామాత, వర్గల్ సరస్వతిమాత ఆలయం, కోముర వెళ్లి మల్లన్న,ఆలయం, రెచింతల వినాయక దేవాలయం, చామoడేశ్వరి తదితర ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.