కరీంనగర్ కలెక్టర్, ఎస్పీలు బదిలీ

విధాత, హైదరాబాద్: ఎన్నికల వేళ కావడంతో అధికారులపై ఎలక్షన్ కమీషన్ బదిలీ కొరడా జులిపిస్తున్నది. ఇటీవలే భారీగా ఐఏఎస్ అధికారులను బదీలీ చేయగా తాజాగా కరీంనగర్‌కు చెందిన కలెక్టర్,పోలీస్ కమిషనర్‌లను బదీలీ చేసింది. కరీం నగర్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీ. గోపీని అలాగే పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎల్. సుబ్బారాయుడులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. వారీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను నియమించే వరకు కింది స్ధాయి అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.