Karnataka | గుజరాతీలు మోడీ, షాల వెంట ఉన్నారు.. కన్నడిగులు ఖర్గే వెంట ఉండాలి: రేవంత్ రెడ్డి
Karnataka కాంగ్రెస్‌ను గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం బీజేపీ 40శాతం కమీషన్ల సర్కార్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నాలుగు సభల్లో ప్రసంగించిన రేవంత్-ప్రసంగాలకు కన్నడిగుల నుంచి భారీ స్పందన విధాత: కన్నడిగులంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, బసవ కళ్యాణ్, హుంనాబాద్ నియోజక వర్గాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. […]

Karnataka
- కాంగ్రెస్‌ను గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం
- బీజేపీ 40శాతం కమీషన్ల సర్కార్
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
- నాలుగు సభల్లో ప్రసంగించిన రేవంత్-ప్రసంగాలకు కన్నడిగుల నుంచి భారీ స్పందన
విధాత: కన్నడిగులంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, బసవ కళ్యాణ్, హుంనాబాద్ నియోజక వర్గాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు.
కన్నడిగులను ప్రశంసలతో ముంచెత్తుతూ రేవంత్ చేసిన ప్రసంగాలకు సభికుల నుంచి భారీ స్పంధన వచ్చింది. ఈ సభలల్లో రేవంత్ మాట్లాడుతూ ‘‘గుజరాతీలు నరేంద్ర మోడీ, అమిత్ షాల వెంట ఉన్నారు, మరి మనం కర్ణాటక వాళ్లం మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వెంట ఉండాలి కదా.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులుగా మన పూర్వ హైదరాబాద్ కర్ణాటక బిడ్డ మల్లికార్జున్ ఖర్గేకు అవకాశం వచ్చింది, మనమంతా ఆయన వెంట ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ కు 150 సీట్లు గెలిపించి ఘన విజయం సాధించి పెట్టాలి’’ అని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ, కర్ణాటక ఎన్నికల స్టార్ కంపెయినర్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Addressed public gathering in #Bhalki today.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Let us join hands for change.
Let us join hands for a better Karnataka. #VoteForCongress#CongressForProgress