Karnataka | సిద్ధరామయ్యకు అన్నివిధాలా సహకరిస్తా: డీకే శివకుమార్
Karnataka ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశా.. ఇప్పుడూ త్యాగానికి సిద్ధం విధాత: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటునకు ఆ పార్టీ సన్నాహకాలు ముమ్మరం చేసింది. సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై పార్టీలో కసరత్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి […]

Karnataka
- ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు
- పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశా.. ఇప్పుడూ త్యాగానికి సిద్ధం
విధాత: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటునకు ఆ పార్టీ సన్నాహకాలు ముమ్మరం చేసింది. సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై పార్టీలో కసరత్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశాను. ఇప్పుడూ ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. సిద్ధరామయ్యకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ భేటీ జరనున్నది. సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా పాల్గొననున్నారు.
సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపైనే భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఉన్నారు. డీకే శివకుమార్ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, సిద్ధరామయ్య 9సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి సీఎల్పీ నేతగా ఎన్నికైతే సిద్ధరామయ్య రెండోసారి సీఎం కానున్నారు. మొదటిసారి 2013-2018 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిద్ధరామయ్య కేబినెట్‌లో డీకే శివకుమార్ మంత్రిగా పనిచేశారు.