KCC (కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు) క్యాంపెయిన్ పునఃప్రారంభం: కలెక్టర్ పమేలా

15 మార్చ్ 2023 వరకు ప్రతి శుక్రవారం విధాత, యాదాద్రి భువనగిరి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసీసీ క్యాంపులను పునః ప్రారంభించను న్నారు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందే విధంగా ఈనెలలో ప్రారంభించి జిల్లా స్థాయిలో ప్రతి శుక్రవారం మార్చి 2023 వరకు కేసీసీ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు ఈ క్యాంపెయిన్ 15 మార్చి […]

  • By: Somu    latest    Sep 20, 2022 12:38 PM IST
KCC (కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు) క్యాంపెయిన్ పునఃప్రారంభం: కలెక్టర్ పమేలా
  • 15 మార్చ్ 2023 వరకు ప్రతి శుక్రవారం

విధాత, యాదాద్రి భువనగిరి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసీసీ క్యాంపులను పునః ప్రారంభించను న్నారు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందే విధంగా ఈనెలలో ప్రారంభించి జిల్లా స్థాయిలో ప్రతి శుక్రవారం మార్చి 2023 వరకు కేసీసీ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు ఈ క్యాంపెయిన్ 15 మార్చి 2023 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకులకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

కేసీసీ క్యాంపెయిన్ యొక్క వివరాలు

కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా PM-KISAN లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించడం కొరకు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయవలసినదిగా బ్యాంకులను ఆదేశించింది. ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరికీ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసి రుణ సదుపాయం అందజేస్తారు.

పీఎం కిసాన్ లబ్ధిదారులు సంబంధిత బ్యాంకు బ్రాంచ్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు పొందేందుకు ఒక పేజీ దరఖాస్తును నింపి భూమి యొక్క పట్టా తాలూకా జిరాక్స్ కాపీ మరియు పంట వివరాలు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లో సమర్పించాలి. సదరు బ్యాంకు బ్రాంచి వారు పీఎం కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా PM KISAN లబ్ధిదారులందరి దరఖాస్తులను స్వీకరించి 14 రోజుల లోపు క్రెడిట్ కార్డులు అంద చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రత్యేక శిబిరంలో సంబంధిత వ్యవసాయ పశు సంరక్షణ మత్స్య శాఖ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, NRLM ప్రాజెక్టు యొక్క బ్యాంకు అధికారులంతా పీఎంకిసాన్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారు సంబంధిత బ్యాంకు ద్వారా క్రెడిట్ కార్డులు పొందేందుకు సహకరించాలని సూచించారు .

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయాలను పశుపాలన చేసే రైతులకు, మత్స్యకారులకు కూడా విస్తరించారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణ సదుపాయం పొంది రైతులు పశుపాలన మరియు మత్స్యకారులు పరిశ్రమలను చేపడితే వారికి సదరు బ్యాంకు బ్రాంచీల వారు అదనపు క్రెడిట్ పరిమితిని కల్పిస్తారు.

ఈ పథకం ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మూడు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులకు బ్యాంకు బ్రాంచీలు వారు ఎటువంటి ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ ఇన్‌స్పెక్షన్ మరియు ఇతర చార్జీలు లేకుండా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం కిసాన్ లబ్ధిదారులంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులపై పంటలకు రుణం మాత్రమే కాక పశుసంపదలకు(పాల ఉత్పత్తులు, గొర్రెలు, మేకల, కోళ్ళ, పందుల, బాతుల పెంపకం) కోసం కూడా రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా కల్పించబడుతుంది.