కేసీఆర్ ప్రజలను ఆగం చేస్తుండు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ప్రజల జీవితాలతో తెరాస చెలగాటం ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: ప్రజల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నాడని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. సిద్ధిపేట పట్టణంలో డబల్ బెడ్ రూంల కేటాయింపులో తనపై కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం సమీపంలో పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్న క్షిరాసాగరం రమేశ్ కుటుంబాన్ని మంగళవారం గజ్వేల్ మండలం అహ్మదిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు […]

- ప్రజల జీవితాలతో తెరాస చెలగాటం
- ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు
విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: ప్రజల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నాడని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. సిద్ధిపేట పట్టణంలో డబల్ బెడ్ రూంల కేటాయింపులో తనపై కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం సమీపంలో పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్న క్షిరాసాగరం రమేశ్ కుటుంబాన్ని మంగళవారం గజ్వేల్ మండలం అహ్మదిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పరామర్శించి, మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో ప్రతినిత్యం ఏదో ఒక మూల దళితులు పేద వర్గాలకు న్యాయం జరగడం లేదని, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని, ఇలాంటి ఘటనలను నాయకులు పోలీసులతో బెదిరించి బయట పొక్కకుండా చేస్తున్నారని అన్నారు. ధరణితో భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
సంక్షేమ పథకాలు రావాలంటే మా పార్టీలో ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు, మంత్రులు అనడం విడ్డూరమన్నారు. కేసీఆర్ తెలంగాణ నీ అబ్బా జాగిర్ కాదని, ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడిపిస్తూ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని, కేసీఆర్ పంజాబ్ , హర్యానా రాష్ట్రలకు వెళ్లి రైతులకు చెక్కులు ఇవ్వడం కాదని, నీ రాష్ట్రం లో ప్రజలకు న్యాయం చెయ్యాలని, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వెంటనే 50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.