రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌ పాల్గొనాలి: ఎంపీ లక్ష్మణ్‌

విదాత: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ రేపు రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రధాని మోడీ సభ నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ పార్టీలకతీతంగా మోడీని ఈయా రాష్ట్రాల వారు ఆహ్వానిస్తున్నారని, తెలంగాణలో మాత్రం ప్రధాని స్వాగతించడం లేదని అన్నారు. ప్రధాని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ దూరంగా […]

  • By: krs    latest    Nov 11, 2022 8:17 AM IST
రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌ పాల్గొనాలి: ఎంపీ లక్ష్మణ్‌

విదాత: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ రేపు రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రధాని మోడీ సభ నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ పార్టీలకతీతంగా మోడీని ఈయా రాష్ట్రాల వారు ఆహ్వానిస్తున్నారని, తెలంగాణలో మాత్రం ప్రధాని స్వాగతించడం లేదని అన్నారు. ప్రధాని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండటం ఇది మూడోసారి అని తెలిపారు.

రాజకీయం, అధికార కార్యక్రమాలకు మధ్య తేడా తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎరువుల కోసం బారులు తీరేవారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా కొరత తీరనున్నదన్నారు. చేనేత కార్మికులకు బీమా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని లక్ష్మణ్‌ సూచించారు. అభివృద్ధి చేయాలని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదన్నారు.