కేసీఆర్ జాతీయ పార్టీ ఏపీలోనూ చర్చ

విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు దసరా నాడు జాతీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం ఏపీలోనూ చర్చలు మొదలయ్యాయి. కేసీఆర్ ఇప్పటికే ఏపీలోని తన సన్నిహితులతో మాట్లాడారని వారి మద్దతు కోరారని అంటున్నారు. ఏపీలో కేసీయార్ పార్టీ వేళ్లూను కోవడానికి ఉన్న అవకాశాలు ఎంత .. బలమెంత ఎవరెవరు ఆ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారన్నది ఇపుడు అన్ని చర్చ సాగుతోంది. కేసీఆర్ గతంలో టీడీపీలో కీలకంగా పని చేశారు. ఇప్పటికి వారితో సన్నిహిత సంబంధాలు […]

  • By: krs    latest    Oct 04, 2022 3:00 PM IST
కేసీఆర్ జాతీయ పార్టీ ఏపీలోనూ చర్చ

విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు దసరా నాడు జాతీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం ఏపీలోనూ చర్చలు మొదలయ్యాయి. కేసీఆర్ ఇప్పటికే ఏపీలోని తన సన్నిహితులతో మాట్లాడారని వారి మద్దతు కోరారని అంటున్నారు. ఏపీలో కేసీయార్ పార్టీ వేళ్లూను కోవడానికి ఉన్న అవకాశాలు ఎంత .. బలమెంత ఎవరెవరు ఆ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారన్నది ఇపుడు అన్ని చర్చ సాగుతోంది.

కేసీఆర్ గతంలో టీడీపీలో కీలకంగా పని చేశారు. ఇప్పటికి వారితో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కేసీఆర్ పూర్వీకులు ఉత్తరాంధ్రలో విజయనగరానికి చెందిన వారు అంటారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని కొందరు నాయకులకు కేసీఆర్ పార్టీ నుంచి కబుర్లు వచ్చాయని అంటున్నారు.

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార వైసీపీ కిక్కిరిసిపోయి ఉంది. ఇంకా కొందరు టీడీపీ, జనసేన అక్కడక్కడా బీజేపీ కూడా ఉనికిలో ఉంది. అయితే అధికార పార్టీలో తమకు సరైన అవకాశాలు దక్కపోతే చాలా మంది కచ్చితంగా ఇతర పార్టీల వైపు చూస్తారు. ఆ విధంగా చూస్తే వైసీపీ నుంచి ఏమైనా జంపింగ్స్ కేసీయార్ జాతీయ పార్టీ వైపుగా సాగుతాయా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇక చంద్రబాబు, పవన్ పొత్తుతో ముందుకు వెళ్లనున్నందున టీడీపీలో టికెట్ రాని వాళ్లు కేసీఆర్ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ సొంత పార్టీ కాంగ్రెస్ ఎదుగుతుంది అన్న నమ్మకం లేకున్నా మరో దారి లేకుండా మరే పార్టీలోకి పోకుండా ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.

అలాంటి వారు కేసీయార్ కొత్తగా జాతీయ పార్టీ పెడితే చేరేందుకు అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి పార్టీ ఇంకా ప్రారంభం కాలేదు.. పార్టీ విధివిధానాలు.. దాని ఉద్దేశ్యాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ చర్చల్లో మాత్రం నిరంతరం ఉంటూ వస్తోంది. మున్ముందు పార్టీ గమనం బట్టి అది వేరే రాష్ట్రాల్లో ఎంతగా బలోపేతం అవుతుందన్నది చూడాలి.

ఇదిలా ఉండగా పలు అంశాలమీద కేసీఆర్‌కు మంచి స్పష్టత ఉందని.. బీజేపీ నుంచి దేశానికి ముప్పు ఉందని, బీజేపీ వల్ల ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఏకం చేసి ప్రజల మద్దతుతో బీజేపీని నిలువరించాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు మంచి వాగ్ధాటి ఉందని, ఏదైనా అంశాన్ని చక్కగా వివరించగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనకు మెండుగా ఉన్నాయని ఉండవల్లి అన్నారు. దేశంలో కేసీఆర్‌ను మించిన కమ్యూనికేటల్ వేరే లేరని, ఆయన సారథ్యంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం అవుతాయని ఆరోజు ఉండవల్లి అన్నారు.