KCR పనులు.. ఏ నక్సలైట్ ఎజెండాలో ఉన్నాయి?: రేవంత్ రెడ్డి

మేధావులు ఉద్యమకారులు ఆలోచించండి కేటీఆర్ మానవత్వం లేని మంత్రి ఎమ్మెల్యే నీకున్నవన్నీ కాంగ్రెస్ బిక్ష డర్టీ డజన్ ఎమ్మెల్యేలను బొందపెట్టాలి మంత్రివర్గంలో నలుగురి మహిళలకు చోటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ(TELANGANA) రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు ఏ నక్సలైట్ ఎజెండాలో ఉన్నాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'నక్సలైట్ (Naxalite) ఎజెండాయే నా ఎజెండా' అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర రావు చేపట్టే కార్యక్రమాలు ఏనక్సలైట్ల ఎజెండాలో ఉన్నాయో? […]

KCR పనులు.. ఏ నక్సలైట్ ఎజెండాలో ఉన్నాయి?: రేవంత్ రెడ్డి
  • మేధావులు ఉద్యమకారులు ఆలోచించండి
  • కేటీఆర్ మానవత్వం లేని మంత్రి
  • ఎమ్మెల్యే నీకున్నవన్నీ కాంగ్రెస్ బిక్ష
  • డర్టీ డజన్ ఎమ్మెల్యేలను బొందపెట్టాలి
  • మంత్రివర్గంలో నలుగురి మహిళలకు చోటు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ(TELANGANA) రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు ఏ నక్సలైట్ ఎజెండాలో ఉన్నాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘నక్సలైట్ (Naxalite) ఎజెండాయే నా ఎజెండా’ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర రావు చేపట్టే కార్యక్రమాలు ఏనక్సలైట్ల ఎజెండాలో ఉన్నాయో? మేధావులు, ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూఆక్రమణాలపై, అక్రమాలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దళితున్ని ముఖ్యమంత్రి (CM)చేయకుండా కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తు చేశారు. తన కొడుకును, అల్లుడ్ని మంత్రులు చేశారని మండిపడ్డారు. బిడ్డను ఎంపీ చేసీనంక ఓడిపోతే ఎమ్మెల్సీ చేశాడని, తన సడ్డకుని కొడుకును రాజ్యసభ ఎంపీ చేశాడని విమర్శించారు.

మరో తన బంధువు ఎంపీగా ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గిరి అప్పగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బంధువు దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చారని ఇవన్నీ ఏ నక్షలైట్ల ఏజెండాలో ఉన్నాయో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని విన్నవించారు. హరితహారం పేరుతో గిరిజన ప్రజల పోడు భూములు లాక్కున్నాడని విమర్శించారు.

భూపాలపల్లి(Bhupalapally) జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని రేగొండ నుంచి 13వ రోజు బుధవారం ప్రారంభమైన హాత్ సే హాత్ జూడో పాదయాత్ర చల్లగరిగే తదితర గ్రామాల మీదుగా సాగి సాయంత్రానికి మొగుళ్ళపల్లి సెంటర్ కు చేరుకుంది. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పాదయాత్రకు, సభకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. చల్లగరిగలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు సోనియమ్మను ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

– మానవత్వం లేని మంత్రి కేటీఆర్(ktr)

హైదరాబాదు(Hyderabad)లో చిన్నారి పై అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబానికి కడుపుకోత మిగిలిందని కన్న బిడ్డను కుక్కలు పీక్కు తింటే మంత్రి కేటీఆర్ సారీతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి వారిని చెప్పు తీసుకొని కొట్టాలని తీవ్రంగా ప్రతిస్పందించారు. కడుపు కోత అంటే తెలవదని ఈ ప్రభుత్వానికి మంత్రులకు మానవత్వం ఉందా అంటూ ప్రశ్నించారు. పేదోడి బిడ్డ చనిపోతే ఓదార్చాలనే సాయం చేయాలని ఈ అడ్డగాడిదలకు జ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు.

– ఎమ్మెల్యే (MLA)నీకున్నవన్నీ కాంగ్రెస్ బిక్ష

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై రేవంత్ రెడ్డి విరుచుక్కపడ్డారు. అక్రమాలపై మంత్రి కేటీఆర్ విచారణ సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏమిచ్చిందని ఈ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాడని, అసలు నీకు ఉన్నవన్నీ కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష అంటూ విమర్శించార. (Ktps)కేటీపీఎస్, డిగ్రీ కాలేజ్, రోడ్లు, ఇప్పుడున్న వసతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవని అన్నారు.

నీ సంపాదనంతా కాంగ్రెస్ పార్టీ దయవల్లే అని, గతంలో చీఫ్ విప్ అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ నీకు ఇచ్చిన అవకాశం అని అన్నారు. నిన్ను ఎమ్మెల్యే చేస్తే రూ.100 కోట్లకు అమ్ముడుపోయేందుకు అవకాశం కల్పించిందీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలని గుర్తు చేశారు. అమ్ముడుపోయిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల (congress cadre) భుజాల మీద ఎత్తుకొని గెలిపిస్తే అడ్డమైన గడ్డి తిని అమ్ముడుపోయారని మండిపడ్డారు.

– ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమం

ఇందిరమ్మ(Indiramma) రాజ్యం రాష్ట్రంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగే అధికారంలోకి రావలసిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలైతాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాల్ పల్లి కాంగ్రెస్ కోఆర్డినేటర్ గండ్ర సత్యనారాయణ రావు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.