Keerthy Suresh | కీర్తి సురేశ్ పెళ్లి..! మనశ్శాంతి కరువైందంటూ తండ్రి ఆవేదన
Keerthy Suresh | నటి కీర్తి సురేశ్ పెళ్లిపై గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె తన స్నేహితుడితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అతన్నే ఆమె పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలపై కీర్తి క్షణాల్లో స్పందించింది. అతను తన స్నేహితుడు అని.. పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆమె పెళ్లిపై వార్తలు వస్తూనే […]

Keerthy Suresh |
నటి కీర్తి సురేశ్ పెళ్లిపై గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె తన స్నేహితుడితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అతన్నే ఆమె పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలపై కీర్తి క్షణాల్లో స్పందించింది.
అతను తన స్నేహితుడు అని.. పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆమె పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా స్పందించారు. ఒక వీడియోను విడుదల చేశారు.
కీర్తి సురేశ్ తన ఫ్రెండ్‌తో దిగిన ఫోటోపై రకరకాల వార్తలు రాస్తున్నారు. కీర్తి షేర్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఫర్హాన్. అతను కీర్తికి మాత్రమే కాదు.. తనకు కూడా తెలుసు. ఫర్హాన్ పుట్టిన రోజు సందర్భంగా కీర్తి ఒక ఫోటో షేర్ చేసి అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది.
ఇక ఆ ఫోటోను ఆధారం చేసుకుని.. ఒక తమిళ మీడియా కీర్తి పెళ్లంటూ వార్త రాసింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అన్నీ ఛానల్స్, వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. కీర్తికి పెళ్లి కుదిరితే తామే స్వయంగా మీడియాకు వెల్లడిస్తాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై పుకార్లు సృష్టించొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుందంటూ సురేశ్ కుమార్ తన వీడియోలో పేర్కొన్నాడు.