Kenya | ఉద్యోగులపై.. మహిళా మేనేజర్ల దౌర్జన్యం! బట్టలిప్పి తనిఖీ
Kenya | విధాత ప్రతినిధి: ఒక విచిత్ర సంఘటనలో ముగ్గురు మహిళా మేనేజర్లు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన కెన్యా మధ్యప్రాంతములో జరిగింది. బ్రౌన్స్ ఫుడ్ కంపెనీ డెయిరీ ప్యాక్టరీలో మహిళా ఉద్యోగులు ఎక్కువగా పని చేస్తున్నారు. మంగళవారం ఆ ప్యాక్టరీకి చెందిన చెత్తకుండిలో మహిళలు నెలసరి సందర్భంగా వాడిన సానిటరీ ప్యాడ్ దొరికింది. ఈ విషయం మహిళా మేనేజర్లకు తెలియడంతో తీవ్ర ఆగ్రహంతో మహిళా ఉద్యోగులపై విరుచుకు పడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే మహిళలను పనులు ఆపు […]

Kenya |
విధాత ప్రతినిధి: ఒక విచిత్ర సంఘటనలో ముగ్గురు మహిళా మేనేజర్లు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన కెన్యా మధ్యప్రాంతములో జరిగింది. బ్రౌన్స్ ఫుడ్ కంపెనీ డెయిరీ ప్యాక్టరీలో మహిళా ఉద్యోగులు ఎక్కువగా పని చేస్తున్నారు. మంగళవారం ఆ ప్యాక్టరీకి చెందిన చెత్తకుండిలో మహిళలు నెలసరి సందర్భంగా వాడిన సానిటరీ ప్యాడ్ దొరికింది.
ఈ విషయం మహిళా మేనేజర్లకు తెలియడంతో తీవ్ర ఆగ్రహంతో మహిళా ఉద్యోగులపై విరుచుకు పడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే మహిళలను పనులు ఆపు చేయించి మహిళల అందరిని లైన్లలో నిలబెట్టి వారి లో దుస్తులను విప్పదీసి మరీ చెక్ చేశారు. దీంతో మహిళలు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు.
మహిళా హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. దానితో దిగివచ్చిన యాజమాన్యం ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులైన ముగ్గురి మహిళా అధికారులపై చర్యలు తీసుకొంది. వారిని విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. ఆ తరువాత పోలీసులు వీరి ముగ్గురినీ అరెస్టు చేశారు.