Khammam | తెలంగాణ జనగర్జన’ స‌భ సైడ్ లైట్స్‌…

Khammam విధాత: ఖ‌మ్మం వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల శంఖారావం పూరించింది. అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో నిర్వ‌హించిన ‘తెలంగాణ జనగర్జన’ విజ‌య‌వంత‌మైంది. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఆదివారం సాయంత్రం 5.50 గంట‌ల‌కు ఖమ్మం జనగర్జన సభకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఖమ్మం చేరుకున్న రాహుల్ గాంధీ ముందుగా పార్టీలో చేరుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు 25 మంది బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల నాయ‌కుల‌కు […]

  • Publish Date - July 2, 2023 / 03:32 PM IST

Khammam

విధాత: ఖ‌మ్మం వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల శంఖారావం పూరించింది. అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో నిర్వ‌హించిన ‘తెలంగాణ జనగర్జన’ విజ‌య‌వంత‌మైంది. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఆదివారం సాయంత్రం 5.50 గంట‌ల‌కు ఖమ్మం జనగర్జన సభకు రాహుల్ గాంధీ చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఖమ్మం చేరుకున్న రాహుల్ గాంధీ ముందుగా పార్టీలో చేరుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు 25 మంది బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల నాయ‌కుల‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం తెలంగాణ జ‌న గ‌ర్జ‌న స‌భ వ‌ర‌కు 109 రోజులపాటు కొనసాగిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ముగించుకుని వ‌చ్చిన మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క‌ను రాహుల్ గాంధీ అభినందించి స‌న్మానించారు.

గత జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లోనే కాంగ్రెస్‌ జనగర్జన సభను నిర్వ‌హించింది. అంతకుముందు ఎంపీ కోమటిరెడ్డితో కలిసి సభా ప్రాంగణానికి భారీ కాన్వాయ్‌తో వచ్చిన పొంగులేటి వ‌చ్చారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభకు రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ పట్టుదలగా జన సమీకరణ చేయ‌డంతో ఖ‌మ్మం జనసంద్రంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఊహించనిదానికంటే భారీగానే కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. సభా స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు వేదిక‌ కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్ స్క్రీన్ ల‌ను ఏర్పాటు చేశారు. జనగర్జన సభలో ‘జై పొంగులేటి’ అని అత్య‌ధిక‌ జెండాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

సుమారు రాత్రి 7.25 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ప్ర‌సంగం ముగిసింది. అయితే స‌భ ప్రారంభం నుంచి ఎండింగ్ వ‌ర‌కు గ‌తంలో ఎన్న‌డులేని విధంగా రాహుల్ గాంధీ పేరుతో పాట‌లు మారుమోగాయి. రాహుల్ ప్ర‌సంగం స‌మ‌యంలో కాంగ్రెస్ శ్రేణులు క‌ర‌తాల ధ్వ‌నులు, ఈల‌లు, జై రాహుల్ గాంధీ నినాదాల‌తో స‌భా ప్రాంగణం మారుమోగింది. ఖ‌మ్మంలో నిర్వ‌హించిన స‌భ ఊహించ‌నిరీతిలో విజ‌య‌వంతం కావ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల‌లో న‌యా జోష్ షురూ అయ్యింది.