స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ నుంచి ఓ కుక్క కూడా చావలే: ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

విధాత: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికార బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ నుంచి కుక్క కూడా చావలేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం, దేశ ప్రజలు, సమైక్యత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారన్నారు. ‘బీజేపీ పార్టీ నేతలు మీరేం చేశారు ? మీ ఇంట్లో ఎవరైనా దేశం కోసం చనిపోయారా? ఎవరైనా త్యాగం చేశారా?’ అంటూ ప్రశ్నించారు. సరిహద్దులో మన సైనికులు […]

  • By: krs    latest    Dec 20, 2022 6:14 AM IST
స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ నుంచి ఓ కుక్క కూడా చావలే: ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

విధాత: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికార బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ నుంచి కుక్క కూడా చావలేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం, దేశ ప్రజలు, సమైక్యత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారన్నారు. ‘బీజేపీ పార్టీ నేతలు మీరేం చేశారు ? మీ ఇంట్లో ఎవరైనా దేశం కోసం చనిపోయారా? ఎవరైనా త్యాగం చేశారా?’ అంటూ ప్రశ్నించారు.

సరిహద్దులో మన సైనికులు 20 మంది అమరులయ్యారన్న ఆయన.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మోదీ 18 సార్లు కలిశారన్నారు. ఈ విషయంపై చర్చించమని అడిగితే మీరు చర్చించడానికి సిద్ధంగా లేదరని, రాజ్‌నాథ్ సింగ్ పేజీ స్టేట్‌మెంట్ ఇచ్చి, వెళ్లిపోయారని విమర్శించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో దేశానికి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బయట సింహంలా మాట్లాడుతాడని, ఎలుకలా నడుస్తారని దుయ్యబట్టారు. అంతకుముందు పార్లమెంట్‌లో చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నిస్తోందని ఈ అంశంపై చర్చకు అనుమతించాల్సిందేనన్నారు.

ప్రతిపక్షాలుగా తవాంగ్ ఇష్యూపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన.. చర్చకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ జగ్‌దీప్‌ ధన్కర్‌ చర్చకు అనుమతివ్వకపోవడంతో విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.

చైనా విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తున్నది. ఆర్మీని రాహుల్ గాంధీ అవమానిం చారని, ఈ విషయాలన్నింటిపై బీజేపీ నేతలు మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సోమ వారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా రాహుల్ గాంధీకి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు.