King Cobra: అత్యంత భయంకరమైన పాము ఇదే.. ఒకే కాటుతో ఏనుగును సైతం నిమిషాల్లో చంపేయగలదు..

King Cobra: ప్రపంచంలో అనేక పాముల జాతులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. కొన్ని విషరహిత పాములు సైతం ఉన్నాయి. అయితే భారతదేశం, చైనా, ఇండోనేషియాలో కనిపించే ఓ పాము మాత్రం అత్యంత భయంకరమైనది. ఒకే కాటుతో ఏనుగును కూడా నిమిషాల్లో సైతం చంపేస్తుంది. ఈ పాము నుంచి వచ్చే విష ప్రభావం నేరుగా నాడీ మండలం మీద పనిచేయడమే అందుకు కారణం. అదే కింగ్ కోబ్రో. ఈ పాము చాలా పొడవుగా ఉంటుంది. దీని పొడవు 18 అడుగులు.. ఇది గుండ్రని తలతో పసుపు లేదా తెల్లటి గీతలతో కనిపిస్తుంది. దీని తల వెనుక భాగం అత్యంత భయంకరంగా ఉంటుంది.
కింగ్ కోబ్రా ఒక్కసారి కాటు వేసిందంటే దాదాపుగా 7 మిల్లీ లీటర్ల విషాన్ని ఏ జంతువు లేదా మనిషి లోకైనా ఇన్ జెక్ట్ చేయగలదు. కింగ్ కోబ్రా ఇతర జంతువులను భయపెట్టడమే కాకుండా దీని ప్రధాన ఆహారం ఇతర పాములు కావడం గమనార్హం. ఇక కింగ్ కోబ్రో పాములు, పక్షులు, బల్లులు వంటి వాటిని తింటుంది. ఇది పాములను తింటుంది కాబట్టి దీన్ని “Ophiophagus” అని పిలుస్తుంటారు. ఓఫియోఫాగస్”(పాము తినేది) అని అర్థం
గూడు పెట్టే ఏకైక పాము
కింగ్ కోబ్రా ఒంటరిగానే అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ మైదాన ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. ఇక తన గుడ్లను కాపాడుకొనేందుకు ఆకులతో ఓ ప్రత్యేకమైన గూడు నిర్మించుకోవడం దీని ప్రత్యేకత. ఈ పాము చాలా అరుదుగా మాత్రమే మనుషుల మీద దాడి చేస్తుందని తెలుస్తున్నది. అయితే తనను తాను రక్షించుకోవడానికి మాత్రం దూకుడుగా ముందుకు సాగుతుంది. దీని రూపం అత్యంత భయంకరం. అందుకే దీన్ని పాముల్లో కింగ్ గా చెబుతుంటారు.