నాగుపాము పడగకు ముద్దు పెట్టాడు.. ఆ తర్వాత? (Video)
Vవిధాత: చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. మనం ఎవరినైనా గిల్లితే.. మళ్లీ తిరిగి వారు కూడా గిల్లుతారు. పాములు పట్టే ఓ యువకుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాడు. నాగుపామును పట్టుకున్న అనంతరం దానికి పడగకు ముద్దు పెట్టాడు. అది తిరిగి అతని పెదాలపై కాటేసింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో బుధవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివమొగ్గలోని భద్రావతిలో నాగుపాము […]

Vవిధాత: చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. మనం ఎవరినైనా గిల్లితే.. మళ్లీ తిరిగి వారు కూడా గిల్లుతారు. పాములు పట్టే ఓ యువకుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాడు. నాగుపామును పట్టుకున్న అనంతరం దానికి పడగకు ముద్దు పెట్టాడు. అది తిరిగి అతని పెదాలపై కాటేసింది.
ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో బుధవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శివమొగ్గలోని భద్రావతిలో నాగుపాము ఉందని పాములు పట్టే వ్యక్తి అలెక్స్‌కు స్థానికులు సమాచారం అందించారు. దీంతో అతను అక్కడికి వెళ్లి నాగుపామును పట్టుకున్నాడు అదే సమయంలో ఆ పాము పడగ విప్పగా.. దానికి ముద్దు పెట్టాడు. పాము కూడా తిరిగి అతని పెదవులపై కాటేసింది.
దీంతో అలెక్స్ పామును విడిచిపెట్టి, ఆస్పత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు అలెక్స్ ప్రాణాలకు ఎలాంటి హానీ జరగలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలెక్స్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.