KNRUHS | MBBS ఆఖరి సంవత్సరం.. పరీక్షా ఫలితాలు విడుదల

92.25 శాతం ఉత్తీర్ణత కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: MBBS ఫైనలియర్‌ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన MBBS చివరి సంవత్సరం (పార్ట్‌–2) రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 1300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలవగా 1703 పాస్ అయ్యారు. మొత్తం […]

  • Publish Date - March 28, 2023 / 04:56 PM IST

  • 92.25 శాతం ఉత్తీర్ణత
  • కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: MBBS ఫైనలియర్‌ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన MBBS చివరి సంవత్సరం (పార్ట్‌–2) రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 1300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలవగా 1703 పాస్ అయ్యారు. మొత్తం 3046 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వై మల్లేశ్వర్ తెలిపారు.

ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ http://www. knruhs.telangana.gov.in లో చూడచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Latest News