Kodandaram | విలీనానికి TJS సిద్ధం: పార్టీ మూడో ప్లీనరీలో కోదండరాం సంచలన ప్రకటన

Kodandaram | తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనే టీజేఎస్ లక్ష్యం విధాత: తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనకు టీజేఎస్ ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తుందని, అవసరమైతే పార్టీ విలీనానికి కూడా సిద్ధంగా ఉన్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో జరుగుతున్న టీజేఎస్ మూడవ ప్లీనరీసభలో కొండేటి వేణుగోపాల్ రెడ్డి ప్రాంగణం శ్రీకాంత్ చారి సభా వేదిక నుండి కోదండరాం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన […]

  • By: krs    latest    Jun 04, 2023 9:25 AM IST
Kodandaram | విలీనానికి TJS సిద్ధం: పార్టీ మూడో ప్లీనరీలో కోదండరాం సంచలన ప్రకటన

Kodandaram |

తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనే టీజేఎస్ లక్ష్యం

విధాత: తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనకు టీజేఎస్ ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తుందని, అవసరమైతే పార్టీ విలీనానికి కూడా సిద్ధంగా ఉన్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన ప్రకటన చేశారు.

సూర్యాపేటలో జరుగుతున్న టీజేఎస్ మూడవ ప్లీనరీసభలో కొండేటి వేణుగోపాల్ రెడ్డి ప్రాంగణం శ్రీకాంత్ చారి సభా వేదిక నుండి కోదండరాం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన లక్ష్యంగా టీజేఎస్ పనిచేస్తుందని, అందుకు ఏ పార్టీతోనైనా కలిసి పని చేసేందుకు, తమ పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమేనన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం పార్టీని పెట్టామని కానీ నేడు కొందరు పైసలతో రాజకీయాలను చేయాలని కోరుకుంటున్నారన్నారు.

అభివృద్ధి పేరుతో కమిషన్లు దండుకుని రాజకీయాలను శాసిస్తున్నారన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ నినాదం పక్కదారి పట్టిందన్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని విమర్శించారు.

ప్రజాస్వామ్య తెలంగాణ నియంతృత్వ పాలన లో మగ్గుతుందన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేస్తుందన్నారు. హక్కుల కోసం, న్యాయం కోసం ఉద్యమించిన రైతులను, నిరుద్యోగ యువతను కేసులు, జైలు పాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో నేడు నోరు విప్పి న్యాయం కోసం అడిగే పరిస్థితి లేదన్నారు. ప్రగతిభవన్ కి వెళ్లాలంటే నిర్బంధిస్తున్నారన్నారు.

అరెస్టులు అక్రమాల మధ్య నిరంతరం కొట్లాడుతూనే ఉన్నామన్నారు. రాజకీయాలు మారాలి అనే భావంతో ధర్మ బిక్షం, సుందరయ్య వంటి వారు డబ్బులతో కాకుండా విలువలతో రాజకీయాలు చేశారన్నారు. నేడు ఆస్తుల కోసమే రాజకీయాల అనే విధంగా తెలంగాణలో పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం ఏ పథకం పెట్టిన కమిషన్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్న భావం నెలకొందన్నారు.

పరీక్షల నిర్వహణ సక్రమంగా లేక పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. భూసేకరణ పేరుతో రైతుల భూమిని దోపిడీ చేస్తున్నారన్నారు. దళిత, గిరిజనుల భూములను ప్రభుత్వమే లాక్కుంటుందన్నారు. చిన్న సన్నకారు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాన్యం అమ్ముకోవడానికి కూడా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.

రైతులకు ఒక రైతుబంధు పేరు చెప్పి ఇతర ప్రభుత్వ సహకారాలన్నీ నిలిపివేశారన్నారు. రైతు రుణమాఫీ చేయకుండా రైతులను అప్పులపాలు చేశారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించకుండా వేధిస్తుందన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులను సమ్మె హక్కు లేకుండా అణచివేస్తూ ప్రభుత్వం నియంతృత్వంగా మారిందన్నా.

ధరణితో అందరూ తిప్పలు పడుతున్నారన్నారు. మహిళలకు పావులా వడ్డీ లేదన్నారు. కౌలు రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. సింగరేణి లో ఉత్పత్తి పెరిగిన కార్మికుల ఉద్యోగాల సంఖ్య 48 వేలకు తగ్గిందన్నారు.

సర్పంచులకు సైతం ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తుందన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రజా సమస్యలపై నిరంతరం టీజేఎస్ పోరాడుతూనే ఉందన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు రైతులు మహిళలు ఉద్యోగుల సమస్యలపై మునుముందు టీజ్ఎస్ మరిన్ని పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.

విద్య వైద్యం అందరికీ అందించాలని టీజేఎస్ లక్షమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. సభలకు టీజేఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.