కోడి పందేలు: ఆయన రాలేదు.. కటౌట్ వచ్చింది!

విధాత: సంక్రాంతి దేశంలో ఎక్కడైనా జరగడం వేరు.. గోదారి జిల్లాల్లో వేరు. కోడిపందాలు.. ఎడ్ల పందాలు .. ఉయ్యాలలు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. సరదాలు. ఆ లెక్కే వేరు.. ఆ కిక్కే వేరు.. అది కూడా రాజుల ప్రాబల్యం ఉండే నరసాపురం.. భీమవరంలో ఆ రేంజి ఇంకోలా ఉంటుంది. ఏటా ఈ ప్రాంతంలో భారీగా కోడి పందేలు జరుగుతాయి. ఇక నరసాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా ఎన్నికై తరువాత అసమ్మతి రాగం ఆలపిస్తూ ఉన్న […]

  • By: krs    latest    Jan 16, 2023 1:55 PM IST
కోడి పందేలు: ఆయన రాలేదు.. కటౌట్ వచ్చింది!

విధాత: సంక్రాంతి దేశంలో ఎక్కడైనా జరగడం వేరు.. గోదారి జిల్లాల్లో వేరు. కోడిపందాలు.. ఎడ్ల పందాలు .. ఉయ్యాలలు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. సరదాలు. ఆ లెక్కే వేరు.. ఆ కిక్కే వేరు.. అది కూడా రాజుల ప్రాబల్యం ఉండే నరసాపురం.. భీమవరంలో ఆ రేంజి ఇంకోలా ఉంటుంది. ఏటా ఈ ప్రాంతంలో భారీగా కోడి పందేలు జరుగుతాయి.

ఇక నరసాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా ఎన్నికై తరువాత అసమ్మతి రాగం ఆలపిస్తూ ఉన్న రఘురామ కృష్ణం రాజుకు కోడి పందేలు అంటే ఇష్టం. గతంలో పోలీసులు కోడి పందేలపై ఉక్కు పాదం మోపితే ఆయనే కోర్టుకెళ్లి సానుకూల ఉత్తర్వులు తీసుకొచ్చారు.

సంక్రాంతి సీజన్లో ఆయన ఆయన హడావుడి ఒక రేంజులో ఉండేది. అయితే ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తు న్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు. సీఐడీ తోను.. ప్రభుత్వం తోనూ పోరాడుతున్న ఆయన సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్.. ఢిల్లీ. బెంగళూరులో ఉంటూ వస్తున్నారు.

ఏపీలోని పలు స్టేషన్లలో ఆయన మీద కేసు దాఖలై ఉండడంతో గత కొంతకాలంగా ఏపీకి వచ్చే పరిస్థితి ఆయనకు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది కోడి పందేలకు ఆయన దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు కోడి పందేలకు రాలేకపోయినా ఆయన అభిమానులు రఘురామ భారీ కటౌట్‌ను భీమవరంలో ఏర్పాటు చేశారు.

కోడి పుంజును పట్టుకుని రఘురామ ఉన్న ఈ నిలువెత్తు కటౌట్ విశేషంగా ఆకర్షిస్తోంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలని ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. కోడిపందేలకు ప్రధాన కేంద్రమైన భీమవరంలో ఈ భారీ కటౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొత్తానికి పండక్కి ఆయన రాలేకపోయినా ఆయన కటౌట్ వచ్చిందిలే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో గొడవ పడకుండా అందరూ ఎంపీలు.. ఎమ్మెల్యేల్లా ఉండుంటే ఈయన హాయిగా కోడి పందాలు చూసేవాడు కదా. అక్కడ సందడి చేసేవాడు కదా.. అనవసరంగా నోటి దురదతో జగన్ మీద కామెంట్లు చేసి కనీసం పండగ పూట అయినా సొంత ఊరికి రాలేని పరిస్థితి తెచ్చుకున్నారు కదాని అంటున్నారు.