Blood Donation | ట్రాన్స్‌జెండర్ నుంచి రక్తం సేకరణకు నిరాకరణ.. ఎందుకంటే..?
Blood Donation | సకాలంలో రక్తం అందక చాలా మంది చనిపోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. కానీ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చు. అందుకే పలు సందర్భాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటారు. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేస్తుంటారు. అందరి మాదరిగానే ఓ ట్రాన్స్‌జెండర్ కూడా రక్తదానం చేసేందుకు వెళ్లాడు. కానీ ఆ ట్రాన్స్‌జెండర్ నుంచి రక్తం సేకరించేందుకు క్యాంపు సిబ్బంది నిరాకరించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వెలుగు చూసింది. […]

Blood Donation | సకాలంలో రక్తం అందక చాలా మంది చనిపోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. కానీ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చు. అందుకే పలు సందర్భాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటారు. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేస్తుంటారు. అందరి మాదరిగానే ఓ ట్రాన్స్‌జెండర్ కూడా రక్తదానం చేసేందుకు వెళ్లాడు. కానీ ఆ ట్రాన్స్‌జెండర్ నుంచి రక్తం సేకరించేందుకు క్యాంపు సిబ్బంది నిరాకరించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని బన్‌హుగ్లీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీంతో రక్తం దానం చేసేందుకు ట్రాన్స్‌జెండర్ ఆ క్యాంపునకు వెళ్లాడు. అయితే అతనికి హెచ్ఐవీ ఉందేమో.. ఆ రక్తం నుంచి ఇతరులకు హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉండొచ్చని అనుమానించిన సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలు అతన్ని అనుమతించలేదు. ఈ క్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ట్రాన్స్‌జెండర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ట్రాన్స్‌జెండర్ నుంచి రక్తం సేకరించారు.
ఈ ఘటనపై ఏపీడీఆర్ ప్రధాన కార్యదర్శి రంజిత్ సుర్ స్పందించారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించకూడదన్నారు. ట్రాన్స్‌జెండర్, గే, హోమో సెక్సువల్ లేదా లెస్బియన్ల నుంచి రక్తం సేకరించొద్దని నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌పుజన్ కౌన్సిల్ నిబంధనలు ఉన్నాయి.. అయితే దీని వెనుకున్న కారణాలను మాత్రం పేర్కొనలేదని ఆయన పేర్కొన్నారు.