కొమ్మినేనికి ప్రాధాన్యం.. ఏపీ ప్రెస్ ఎకాడమి చైర్మన్‌గా నియామకం

ఉన్నమాట : సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును మరో పదవి వరించింది. ప్రస్తుతం సాక్షి టీవీలో ప్రయమ్ టైములో పలు డిబేట్లు నిర్వహించే కొమ్మినేని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులు కానున్నారు. దీనికి సంబంధించి రెండుమూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుత చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొమ్మినేని ఈ పదవిలోకి వస్తున్నారు. దాదాపు పాతికేళ్ళు ఈనాడులో పని చేసిన ఆయన అప్పట్లో రాష్ట్రంలో రాజకీయం అంటూ ఎడిట్ […]

  • By: Somu    latest    Oct 27, 2022 11:44 AM IST
కొమ్మినేనికి ప్రాధాన్యం.. ఏపీ ప్రెస్ ఎకాడమి చైర్మన్‌గా నియామకం

ఉన్నమాట : సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును మరో పదవి వరించింది. ప్రస్తుతం సాక్షి టీవీలో ప్రయమ్ టైములో పలు డిబేట్లు నిర్వహించే కొమ్మినేని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులు కానున్నారు.

దీనికి సంబంధించి రెండుమూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుత చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొమ్మినేని ఈ పదవిలోకి వస్తున్నారు. దాదాపు పాతికేళ్ళు ఈనాడులో పని చేసిన ఆయన అప్పట్లో రాష్ట్రంలో రాజకీయం అంటూ ఎడిట్ పేజీలో ప్రత్యేక వ్యాసాలు రాసేవారు.

ఆ తరువాత ఆంధ్రజ్యోతి పునః ప్రారంభంలో 2002లో బ్యూరోచీఫ్‌గా అందులో చేరారు. అనంతరం ఎన్టీవీలో చేరి జగన్‌కు అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలతో సంస్థ ఆయనను తొలగించింది. ఆ వెను వెంటనే ఆయన సాక్షి టీవీలో చేరి రాజకీయ విశ్లేషణలు.. డిబేట్లు నడుపుతూ వస్తున్నారు.

గతంలో కొమ్మినేనికి చంద్రబాబుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి కానీ ఎక్కడ తేడా కొట్టిందో గానీ చంద్రబాబు వల్లనే కొమ్మినేని ఎన్టీవీలో నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత సాక్షి టీవీ కొమ్మినేనికి పెద్దపీట వేసింది. ఇప్పుడు ఆయనను మరింత ప్రాధాన్య స్థానానికి తీసుకువెళ్లిన జగన్ ఏకంగా కేబినెట్ హోదా కలిగిన ప్రెస్ ఎకాడమి పోస్ట్ ఇస్తున్నారు.