బీఎస్పీతో పొత్తు ఎఫెక్ట్.. బీఆరెస్‌కు కోనేరు కోనేప్ప రాజీనామా?

బీఎస్పీతో బీఆరెస్ పొత్తు వ్యవహారం ఆ రెండు పార్టీల్లో అసంతృప్తులను రాజేస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీతో పొత్తును నిరసిస్తూ బీఆరెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు

బీఎస్పీతో పొత్తు ఎఫెక్ట్.. బీఆరెస్‌కు కోనేరు కోనేప్ప రాజీనామా?

విధాత: బీఎస్పీతో బీఆరెస్ పొత్తు వ్యవహారం ఆ రెండు పార్టీల్లో అసంతృప్తులను రాజేస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీతో పొత్తును నిరసిస్తూ బీఆరెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోటీ చేశారు. ఆయనతో పాటు ప్రవీణ్ కుమార్ ఓటమిపాలవ్వగా బిజేపి అభ్యర్థి హరీశ్ బాబు విజయం సాధించారు.


బీఆరెస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన కోనేరు కోనేప్ప త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా సమాచారం . అటు బీఆరెస్ తో పొత్తు వ్యవహారం బీఎస్పీలో కూడా అసమ్మతి రాజేస్తుంది. పొత్తును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్. అధికార ప్రతినిధి డాక్టర్ వెంకటేష్ చౌహన్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు.