Khammam: ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కృష్ణారావు ఎన్నిక
విధాత: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా దిరిశాల కృష్ణారావు 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 754 ఓట్లకు గాను 225 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి నేరెళ్ల శ్రీనివాస్ పై 24 ఓట్ల తేడాతో కృష్ణా రావు గెలిచారు. మొదటి రౌండ్ నుండి ఆఖరి రౌండ్ వరకు ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో మెజారిటీ ఇరువురి మధ్య దోబూచులాడింది. చివరకు కృష్ణారావుకు 228 ఓట్లు, నేరెళ్ల శ్రీనివాస్ కు 204 ఓట్లు, […]

విధాత: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా దిరిశాల కృష్ణారావు 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 754 ఓట్లకు గాను 225 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి నేరెళ్ల శ్రీనివాస్ పై 24 ఓట్ల తేడాతో కృష్ణా రావు గెలిచారు. మొదటి రౌండ్ నుండి ఆఖరి రౌండ్ వరకు ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో మెజారిటీ ఇరువురి మధ్య దోబూచులాడింది.
చివరకు కృష్ణారావుకు 228 ఓట్లు, నేరెళ్ల శ్రీనివాస్ కు 204 ఓట్లు, పోటీలో ఉన్న మిగతా నలుగురు అభ్యర్థులు స్వర్ణకుమారికి 132 ఓట్లు, సుధీర్ సింగ్ 118 ఓట్లు, ధౌఫిక్ కు 49 ఓట్లు, మల్లెపాటి అప్పారావుకు 13 ఓట్లు లభించాయి. జనరల్ సెక్రెటరీగా మన్నేపల్లి బసవయ్య తన ప్రత్యర్థి చింతనిప్పు వెంకట్ పై 36 ఓట్లతో గెలుపొందారు. జాయింట్ సెక్రెటరీగా విజయ రాఘవ, స్పోర్ట్స్ సెక్రటరీగా రావుల వెంకట్ విజయం సాధించారు.