వ‌రంగ‌ల్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా జీవ‌న్‌

వ‌రంగ‌ల్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా తీగెల జీవ‌న్ గెలుపొందారు. అసోసియేష‌న్‌కు గురువారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో జీవ‌న్‌తో పాటు ఆయ‌న ప్యానెల్ మెజార్టీ ఓట్ల‌తో విజ‌యం సాధించింది

వ‌రంగ‌ల్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా జీవ‌న్‌
  • సంబ‌రాలు చేసుకున్న న్యాయ‌వాదులు


విధాత‌, వ‌రంగ‌ల్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: వ‌రంగ‌ల్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా తీగెల జీవ‌న్ గెలుపొందారు. అసోసియేష‌న్‌కు గురువారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో జీవ‌న్‌తో పాటు ఆయ‌న ప్యానెల్ మెజార్టీ ఓట్ల‌తో విజ‌యం సాధించింది. దీంతో న్యాయ‌వాదులు కోర్టు ఆవ‌ర‌ణ‌లో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గ ఎన్నిక‌ల సంద‌ర్భంగా గురువారం ఉద‌యం పోలింగ్ నిర్వ‌హించారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను చేపట్టారు. అధ్య‌క్షునిగా గెలుపొందిన జీవ‌న్‌కు 254 ఓట్లు రాగా ప్ర‌త్య‌ర్దులుగా నిలిచిన శ్రీ‌రాఘ‌వ‌రావుకు 179, వేణుగోపాల్ రావుకు 73 ఓట్లు ల‌భించాయి. ఉపాధ్య‌క్షునిగా పి. సుద‌ర్శ‌న్ విజ‌యం సాధించారు.

కాగా.. సుద‌ర్శ‌న్ కు 299 ఓట్లు రాగా ప్ర‌త్య‌ర్ధి ఎం. జ‌య‌పాల్ కు 190 ఓట్లు పొందారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మ‌హ్మ‌ద్ ముద్ద‌స్సార్ అహ్మ‌ద్ ఖ‌య్యూం గెలుపొందారు. ఖ‌య్యూంకు 176 ఓట్లు రాగా, జి. శివ‌కు 144, పి. శ్రీ‌నివాస రావుకు 92, పి.ర‌మేష్ కు81 ఓట్లు వ‌చ్చాయి. మ‌హిళా జాయింట్ సెక్ర‌ట‌రిగా కె.గోపికా రాణి గెలుపొందారు. గోపికా రాణికి 266 ఓట్లు రాగా, ప్ర‌త్య‌ర్ధి ఆర్‌. శ‌శిరేఖ‌కు 223 ఓట్లు వ‌చ్చాయి. స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ జాయింట్ సెక్ర‌ట‌రీగా జి. వెంక‌ట‌ర‌మ‌ణ విజ‌యం సాధించారు. వెంక‌ట‌ర‌మ‌ణ‌కు 178 , ప్ర‌త్య‌ర్ధులు ఎన్‌.శివ‌ప్ర‌సాద్ కు 164, ఎం. దేవెంద‌ర్ కు 159 ఓట్లు ల‌భించాయి. లైబ్ర‌రీ జాయింట్ సెక్ర‌ట‌రీగా పి. ముర‌ళికుమార్ 302 ఓట్ల‌తో గెలుపొందారు. ప్ర‌త్య‌ర్ధి జె. ఉద‌య్ కుమార్ కు 194 ఓట్లు ల‌భించిన‌ట్లు ఎన్నిక‌ల ధికారులు తెలిపారు.