Krithi Shetty | సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే చిత్రం తెరకెక్కగా, ఇందులో కథానాయికగా నటించింది కృతి శెట్టి. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఉప్పెన తర్వాత కృతికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. నాని నటించిన శ్యామ్ సింగరాయ్, నాగార్జున, చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఇటీవల వరుస ఫ్లాప్స్‌ని […]
Krithi Shetty |
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే చిత్రం తెరకెక్కగా, ఇందులో కథానాయికగా నటించింది కృతి శెట్టి. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఉప్పెన తర్వాత కృతికి ఆఫర్స్ బాగానే వచ్చాయి.
నాని నటించిన శ్యామ్ సింగరాయ్, నాగార్జున, చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఇటీవల వరుస ఫ్లాప్స్‌ని చవిచూస్తుంది. అయితే కృతికి సంబంధించిన ఓ వార్త ఇటీవల నెట్టింట తెగ హల్ చల్ చేసింది. ఆ వార్త విని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.
కృతి శెట్టిని ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో కొడుకు చాలా వేధించినట్టు ప్రచారాలు సాగాయి. రోజు ఫోన్ చేసి తనతో వేధించాలని, కలిసి తిరగాలని వేధించాడని, అంతేకాక డేటింగ్ కి రావాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ప్రచారాలు జోరుగా సాగాయి.
ఈ క్రమంలో కృతి శెట్టి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆ పుకార్లకి చెక్ పెట్టింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు దయచేసి చేయకండి. జనరల్‌గా నేను పెద్ద రూమర్స్ గురించి పట్టించుకోను. కానీ ఇలాంటి వార్తలు పరిధిని దాటి ప్రచార స్థాయికి వెళుతుండటంతో స్పందించక తప్పలేదని పేర్కొంది కృతి శెట్టి. మొత్తానికి కృతి శెట్టి ఇచ్చిన క్లారిటీతో తప్పుడు ప్రచారాలకి బ్రేక్ పడింది.
ఇక కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కృతి శెట్టి.. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం జయం రవి సినిమా జీనిలో నటిస్తున్న ఈ అమ్మడు ఓ మలయాళ చిత్రం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కృతి శెట్టికి ఇప్పుడు మరో మంచి హిట్ దక్కితే కెరియర్ మళ్లీ జెట్ స్పీడ్‌తో దూసుకు పోతుంది. ఇటీవల కృతి సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది.