లచ్చిరెడ్డికి సీసీఎల్‌ఏలో పోస్టింగ్‌

పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ వీ లచ్చిరెడ్డిని సీసీఎల్‌ఏలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి

లచ్చిరెడ్డికి సీసీఎల్‌ఏలో పోస్టింగ్‌
  • ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌



విధాత: పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ వీ లచ్చిరెడ్డిని సీసీఎల్‌ఏలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ ఈ బాధ్యతల్లో ఉన్న డీ శ్రీనివాస్‌రెడ్డిని రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో లచ్చిరెడ్డి కీసర ఆర్డీవోగా పనిచేశారు. అయితే.. ఆ సమయంలో తాము చెప్పిన పని చేయలేదంటూ బీఆరెస్‌ ప్రభుత్వ పెద్దలు పక్కకు పెట్టారని సమాచారం.


అప్పటి నుంచి ఆయన ఉద్యోగానికి దూరంగా ఉన్నారు. రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న లచ్చిరెడ్డి ప్రస్తుతం డిప్యూటీ కలె­క్టర్ల అసో­సి­యే­షన్‌ ప్రెసి­డెంట్‌గా పనిచేస్తున్నారు. గతంలో తాసిల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కొంతకాలంగా ఉద్యోగానికి దూరంగా ఉన్న లచ్చిరెడ్డి ప్రభుత్వం మారిన నేపథ్యంలో మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఇప్పుడు ఆయనను సీసీఎల్‌లో కీలక పోస్టులో నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.