Relationship | సహజీవనాన్ని వివాహంలా గుర్తించలేం

Relationship | అది చట్టబద్ధమైన బంధం కాదన్నకేరళ హైకోర్టు తిరువనంతపురం : పురుషుడు, మహిళ సహజీవనం (live-in relationship) చేస్తే దానిని వివాహంగా చట్టం గుర్తించదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. చట్ట ప్రకారం లేదా ఆచారాల ప్రకారం జరిగిన వివాహాలనే చట్టం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నది. కనుక.. ఒక ఒప్పందం ప్రకారం సహజీవనం చేస్తున్న జంట తమది వివాహంగా చెప్పుకోవడానికి కానీ, విడాకులు కోరడానికి కానీ వీల్లేదని తెలిపింది. భిన్న మతాలకు చెందిన ఒక జంట […]

  • By: Somu    latest    Jun 14, 2023 11:05 AM IST
Relationship | సహజీవనాన్ని వివాహంలా గుర్తించలేం

Relationship |

  • అది చట్టబద్ధమైన బంధం కాదన్నకేరళ హైకోర్టు

తిరువనంతపురం : పురుషుడు, మహిళ సహజీవనం (live-in relationship) చేస్తే దానిని వివాహంగా చట్టం గుర్తించదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. చట్ట ప్రకారం లేదా ఆచారాల ప్రకారం జరిగిన వివాహాలనే చట్టం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నది.

కనుక.. ఒక ఒప్పందం ప్రకారం సహజీవనం చేస్తున్న జంట తమది వివాహంగా చెప్పుకోవడానికి కానీ, విడాకులు కోరడానికి కానీ వీల్లేదని తెలిపింది. భిన్న మతాలకు చెందిన ఒక జంట విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయిస్తే.. వారి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టుకు వచ్చారు.

ఈ జంటలో ఒకరు హిందువు, మరొకరు క్రిస్టియన్‌. వీరిద్దరూ రిజిస్టర్డ్‌ ఒప్పందంపై 2006 నుంచి సహజీవనం చేస్తున్నారు. వారికి 16 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నది. అయితే.. తమ బంధాన్ని కొనసాగించదల్చుకోని ఆ జంట.. విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. వీరి పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు.. సహజీవనాలను చట్టం ఇప్పటికైతే వివాహంలా గుర్తించడం లేదని పేర్కొన్నది. ఉ

భయ పక్షాలు ఒప్పందం ఆధారంగా సహజీవనం చేస్తున్నందున సొంతగా విడాకులు తీసుకోవచ్చని సూచించింది. ఇటువంటి కేసులలో జోక్యం చేసుకోవడానికి ఫ్యామిలీ కోర్టులకు కూడా అధికారం లేదని తెలిపింది