విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి తెలంగాణ
విధాత: విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించింది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడు 2,012 యూనిట్లకు పెరిగింది. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా విద్యుత్ […]

విధాత: విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించింది.
తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడు 2,012 యూనిట్లకు పెరిగింది. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది.
రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వం తెలిపింది.