Nalgonda | నల్లగొండలో చిరుత కలకలం

Nalgonda | విధాత : నల్లగొండ జిల్లా గుర్రంపోడు గ్రామంలో చిరుత పులి (Leopard) సంచారం కలకలం రేపింది. చిరుతను చూసినట్లుగా గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది చిరుత సంచరించిన మార్గంలో పాదముద్రలను సేకరించారు. ఆ పాదముద్రలు చిరుత పులివా లేక హైనా పాదముద్రలా అన్నదానిపై విశ్లేషణ చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్లే రైతులు ఎవరు కూడా ఒంటరిగా వెళ్లవద్దని అక్కడి వారికి హెచ్చరికలు జారీ చేశారు.