సిద్దిపేట: కస్తూరి పల్లెలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరి పల్లి గ్రామంలో చిరుత పులి సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం తెల్లవారు జామున చిరుతపులి గ్రామ శివారులో తిరుగడం రైతులు చూసినట్లు చేస్బుతున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో శంకరాయ కుంటకు చేందిన ఏరువా రాజు అనే రైతు మిర్చి తోటలో సంచరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు, కొందరు, చిరుత సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా పాదముద్రలు చూసి చిరుత పులి అని […]

విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరి పల్లి గ్రామంలో చిరుత పులి సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం తెల్లవారు జామున చిరుతపులి గ్రామ శివారులో తిరుగడం రైతులు చూసినట్లు చేస్బుతున్నారు.
మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో శంకరాయ కుంటకు చేందిన ఏరువా రాజు అనే రైతు మిర్చి తోటలో సంచరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు, కొందరు, చిరుత సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా పాదముద్రలు చూసి చిరుత పులి అని నిర్ధారణ చేశారు.
చిరుత పులి సంచరిస్తుందన్న విషయం నిజమేనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు సూచించారు.