Huzurabad: పోలీసులతో భయపెట్టాలని చూస్తే.. లక్షల మందితో లడాయి చేస్తాం: ఈట‌ల‌

కాషాయ జెండాలను, జైశ్రీరామ్ నినాదాలను నిషేధించడం వీరి తరం కాదు నిషేధించిన పార్టీల చరిత్ర ఏమయిందో కళ్ళ ముందు ఉందన్నారు అధికారం ఇచ్చిన ప్రజలే ఫీజులు పీకేస్తారు జాగ్రత్త హుజురాబాద్‌లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విధాత, కరీంనగర్ బ్యూరో: రాజ్యాంగం మీద, పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది.. పోలీసులను మాపై ప్రయోగించి భయ పెట్టాలని చూస్తే లక్షల మందితో లడాయి చేస్తామని హెచ్చరించారు హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్. పోలీసులు కూడా అధికార పార్టీకి […]

Huzurabad: పోలీసులతో భయపెట్టాలని చూస్తే.. లక్షల మందితో లడాయి చేస్తాం: ఈట‌ల‌
  • కాషాయ జెండాలను, జైశ్రీరామ్ నినాదాలను నిషేధించడం వీరి తరం కాదు
  • నిషేధించిన పార్టీల చరిత్ర ఏమయిందో కళ్ళ ముందు ఉందన్నారు
  • అధికారం ఇచ్చిన ప్రజలే ఫీజులు పీకేస్తారు జాగ్రత్త
  • హుజురాబాద్‌లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

విధాత, కరీంనగర్ బ్యూరో: రాజ్యాంగం మీద, పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది.. పోలీసులను మాపై ప్రయోగించి భయ పెట్టాలని చూస్తే లక్షల మందితో లడాయి చేస్తామని హెచ్చరించారు హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం మానుకోవాలని హితవు ప‌లికారు.

ఇది మనకు వనవాసకాలం… శ్రీరామచంద్రుని అంతటి వ్యక్తే వనవాసంలో ఉన్నారు… కొద్ది రోజులు ఓపిక పట్టండని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. 20 ఏళ్లుగా ఇల్లంతకుంట శ్రీరామచంద్రునికి తానే స్వయంగా తలంబ్రాలు సమర్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ‘నేను ఇప్పటికీ ఎమ్మెల్యే గానే ఉన్నాను.. అయినా ఈ సారి నాకు తలంబ్రాలు తీసుకెళ్లే అవకాశం ఇవ్వలేదు.. ఇవ్వకపోయినా బాధ లేదు.. కానీ జైశ్రీరామ్ నినాదాలు కూడా చేయొద్దని నిషేధం విధించారు.. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

శ్రీరాముని కళ్యాణంలో జైశ్రీరామ్ అనవద్దు అనడానికి వీళ్ళు ఎవరని ఆయన ప్రశ్నించారు. జైశ్రీరామ్ నినాదాలను నిషేధించాలని చూస్తే ఆ నినాదాలతో ఇల్లంతకుంట మారుమ్రోగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కాషాయ జెండాలను, జై శ్రీ రామ్ నినాదాలను నిషేధించడం ఎవ‌రి వల్ల కాదన్నారు.
జైశ్రీరామ్ నినాదాన్ని నిషేధించిన పార్టీల బ్రతుకులు ఏమయ్యావో చూస్తూనే ఉన్నామన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంటలో.. శ్రీరాముని కళ్యాణానికి వచ్చి శ్రీరాముని నినాదాలు చేయొద్దనే అధికారం వీరికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

కాషాయమే శ్రీరామునిది, కళ్యాణమే శ్రీరామునిది.. రాముని ముందు నువ్వెంత? అన్నారు. కేసీఆర్ దేవతలతో పెట్టుకున్న వారి బ్రతుకు ఏమవుతుందో తెలుసుకో, గాలిలో కలిసిపోతావు అంటూ హెచ్చరించారు. నడమంత్రపు సిరితో మిడిసి పడవద్దని, ప్రజాస్వామ్య వ్యవస్థలోప్రజలే గొప్పవారని, అధికారం ఇచ్చేవారు.. ఆ అధికారం గుంజేసేవారు.. ఫీజు పీకేది కూడా వారే అని మర్చిపోవద్దని సూచించారు.