ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం: KCR పిలుపు
విధాత: ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం చిన్నారులకు […]

విధాత: ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం చిన్నారులకు రంజాన్ కానుకలను అందించారు.
అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు కేసీఆర్.
దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో తెలంగాణను అందుకోలేకపోతున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం 1200 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ తొమ్మిదేండ్లలో మైనార్టీల కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రధాన సమస్యలైన సాగు, తాగు నీటితో పాటు కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు. దేశం కూడా తెలంగాణ రాష్ట్రంలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.