Yadadri Bhuvanagiri: లిక్కర్ స్కాం రాజకీయ కుట్ర.. అది ఢిల్లీ ప్రభుత్వ పాలసీ మాత్రమే: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: లిక్కర్ స్కాం బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర మాత్రమేనని అది ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ మాత్రమేనని, స్కామ్ కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలో నిర్వహించిన BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో అసలు లిక్కర్ స్కాం ఏమి లేదని, అది ఆ రాష్టం తీసుకున్న పాలసీ మాత్రమేనన్నారు. దానిని రాజకీయం చేస్తూ ఐటీ, సీఐడిలను […]

విధాత: లిక్కర్ స్కాం బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర మాత్రమేనని అది ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ మాత్రమేనని, స్కామ్ కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలో నిర్వహించిన BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
ఢిల్లీలో అసలు లిక్కర్ స్కాం ఏమి లేదని, అది ఆ రాష్టం తీసుకున్న పాలసీ మాత్రమేనన్నారు. దానిని రాజకీయం చేస్తూ ఐటీ, సీఐడిలను పంపినా, ఏమి చేయలేక ఈడిని ముందు పెట్టి బీజేపీ ఆడిస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా బిజెపి నేతలు చెప్పిందాన్ని ఫిర్యాదుగా తీసుకుని ఈడీ విచారణ చేయడం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అన్నారు.
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఆకలి చావులు పెరిగాయన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని దోచి, అతని దోస్తులు ఆదాని, అంబానీలకు అప్పనంగా దోచి పెడుతుంటే కాంగ్రెస్ చోధ్యం చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లో లేడని, రాహుల్ గాంధీకి , కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ప్రశ్నించే దమ్ము లేదని, కాంగ్రెస్ పార్టీకి చావ చచ్చిందని, దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో బీజేపీని గద్దె దించడంలో నిర్ణయాత్మక శక్తిగా మారబోతుందన్నారు.
దేశ ప్రజల ముందు బీజేపీ దురాగతాలను బయట పెడతామన్నారు. బీజేపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.