యాదాద్రి-భువనగిరి: నవంబర్ 12న లోక్ అదాలత్
విధాత, యాదాద్రి భువనగిరి: జిల్లా పోలీసు యంత్రాంగంతో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రిమినల్ కేసుల పరిష్కారం, నిర్వహణ అంశాలపై చర్చించి పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. నవంబర్ రెండవ శనివారం 12 వతేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడే అన్నీ సివిల్, క్రిమినల్, బ్యాంక్ కేసులే కాకుండా వినియోగదారుల వాజ్యాలను కూడా ప్రత్యేకించి […]

విధాత, యాదాద్రి భువనగిరి: జిల్లా పోలీసు యంత్రాంగంతో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రిమినల్ కేసుల పరిష్కారం, నిర్వహణ అంశాలపై చర్చించి పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు.
నవంబర్ రెండవ శనివారం 12 వతేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడే అన్నీ సివిల్, క్రిమినల్, బ్యాంక్ కేసులే కాకుండా వినియోగదారుల వాజ్యాలను కూడా ప్రత్యేకించి పరిష్కరించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో బాల సంరక్షణ సమితి పటిష్టంగా పనిచేయటానికి ప్రత్యేక పోలీసు ఏర్పాటు చేయబడిందని, వీరికి న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇవ్వటానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ డి.నాగేశ్వరరావు, భువనగిరి మరియు యాదగిరిగుట్ట ఏసీపీలు వెంకట్ రెడ్డి, నర్సింహా రెడ్డి , భువనగిరి సబ్ జైలు పర్యవేక్షణాధికారి పూర్ణచందర్, లయన్ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.