నర్సింగ్ కాలేజీ బస్సును ఢీ కొట్టిన లారీ..15మందికి గాయాలు
విధాత, సూర్యాపేట జిల్లా నకిరేకల్ మండల పరిధిలో తాటికల్ ఫ్లై ఓవర్ వద్ద నర్సింగ్ కాలేజీ బస్సును లారీ వెనక నుంచి ఢీకొన్న ఘటనలో బస్సు బోల్తా పడి 15 మంది పైగా విద్యార్థినిలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట పీజీ కాలేజి ఆఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు నల్గొండలో పరీక్షలు రాసేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది బస్సులో 30 మందికి పైగా విద్యార్థినిలు ఉన్నారు. ఉన్న వారిని […]

విధాత, సూర్యాపేట జిల్లా నకిరేకల్ మండల పరిధిలో తాటికల్ ఫ్లై ఓవర్ వద్ద నర్సింగ్ కాలేజీ బస్సును లారీ వెనక నుంచి ఢీకొన్న ఘటనలో బస్సు బోల్తా పడి 15 మంది పైగా విద్యార్థినిలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సూర్యాపేట పీజీ కాలేజి ఆఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు నల్గొండలో పరీక్షలు రాసేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది బస్సులో 30 మందికి పైగా విద్యార్థినిలు ఉన్నారు.
ఉన్న వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి, నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.
స్పందించిన మంత్రి హరీశ్‌రావు
ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసున్నారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికి ప్రాణాపాయం లేదని వివరించిన వైద్యాధికారులు
గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, బాగా చూసుకోవాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.