Samantha | ఇలాంటి వాడినే ప్రేమించండి, పెళ్లి చేసుకోండి! పెళ్లి అని.. సమంత మళ్లీ ఎందుకు కెలుకుతోంది

Samantha | సమంత అనగానే టాలీవుడ్‌లో రోజుకో వైరల్ టాపిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో దుమారం లేపే విషయంలో సమంత టాపిక్ తప్పకుండా ఉంటోందీ మధ్య. ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా ప్రత్యేకమైన న్యూస్‌గా నెట్టింట తిరుగుతోంది. ఇక సమంత చుట్టూ పోగయ్యే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. సమంత, నాగచైతన్య విడాకుల నుంచి, ఆమె అనారోగ్యం వరకూ అన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆమధ్య మరొకరితో సమంత సన్నిహితంగా […]

  • By: krs    latest    Jul 27, 2023 4:10 AM IST
Samantha | ఇలాంటి వాడినే ప్రేమించండి, పెళ్లి చేసుకోండి! పెళ్లి అని.. సమంత మళ్లీ ఎందుకు కెలుకుతోంది

Samantha |

సమంత అనగానే టాలీవుడ్‌లో రోజుకో వైరల్ టాపిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో దుమారం లేపే విషయంలో సమంత టాపిక్ తప్పకుండా ఉంటోందీ మధ్య. ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా ప్రత్యేకమైన న్యూస్‌గా నెట్టింట తిరుగుతోంది. ఇక సమంత చుట్టూ పోగయ్యే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి.

సమంత, నాగచైతన్య విడాకుల నుంచి, ఆమె అనారోగ్యం వరకూ అన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆమధ్య మరొకరితో సమంత సన్నిహితంగా ఉంటుందనే రూమర్స్ తర్వాత… ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళు ట్రీట్మెంట్‌కు వెళ్ళనుందనే సమాచారం వరకూ.. అన్నీ ఒకదానికి మించి మరొకటి సోషల్ మీడియాను చుట్టేశాయి. అయితే ప్రస్తుతం మరో విషయంలో ట్రోల్ చేస్తున్నారు సమంతను. అదేంటంటే..

తాజాగా విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఆ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈమధ్య ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. అది నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో సామ్, విజయ్‌లు బెడ్ మీద రొమాంటిక్‌గా ఉండే సీన్స్‌తో పాటు, ఇద్దరికీ బాగా కెమిస్ట్రీ కుదిరినట్టుగా కొన్ని క్లిప్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆరాధ్య అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలోని ఓ క్లిప్‌ని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ ఇచ్చింది సమంత.

‘‘అమ్మాయిలూ ప్రేమిస్తే ఇలాంటి వాడినే ప్రేమించండి, పెళ్ళి చేసుకోండి’’ అంటూ సమంత ఆ క్లిప్‌ని షేర్ చేసింది. అదిప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలా ఎందుకు క్యాప్షన్ పెట్టిందో అర్థం కాక సమంతను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అసలు సమంత ఉద్దేశ్యం ఏమై ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటుందని చర్చించుకుంటున్నారు. ఈ లిరికల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది.

తన అనారోగ్యం కారణంగా మరే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేసింది సమంత. ఇక తీసుకున్న అడ్వాన్స్‌లను కూడా వెనక్కు తిరిగి ఇచ్చేసిందట. ది ఫ్యామిలీ మ్యాన్‌ డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకె ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఇండియ‌న్ వెర్ష‌న్ సిటాడెల్‌లోనూ న‌టిస్తోంది సమంత. త్వరలోనే అమెరికాకు తన ప్రయాణం ఉండటంతో.. తను ఒప్పుకున్న షూటింగ్స్ అన్నీ పూర్తి చేసింది. ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది కనుక.. ఇక అమెరికా ప్రయాణానికి అన్ని అడ్డంకులూ తొలగినట్టే.