పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
Lover Murder | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తన ప్రేయసినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ప్రియురాలు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూనే ఉంది. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ప్రియుడు.. తనకు దక్కకపోతే, మరెవరికి దక్కొద్దనే ఉద్దేశంతో లవర్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దావణగెరెకు చెందిన చాంద్ పీర్ అలియాస్ సాదత్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న […]

Lover Murder | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తన ప్రేయసినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ప్రియురాలు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూనే ఉంది. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ప్రియుడు.. తనకు దక్కకపోతే, మరెవరికి దక్కొద్దనే ఉద్దేశంతో లవర్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దావణగెరెకు చెందిన చాంద్ పీర్ అలియాస్ సాదత్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న సుల్తానాను గత కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. సాదత్ ప్రేమకు సుల్తానా కూడా పడిపోయింది. కానీ పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో ఆమె పేరెంట్స్‌ను కూడా సాదత్ సంప్రదించాడు. కానీ వారు కూడా నో చెప్పారు. మరోసారి తమ ఇంటికి వచ్చినా, తమ అమ్మాయి వెంట పడ్డ పోలీసు కేసు పెడుతామని సాదత్‌ను హెచ్చరించారు.
మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు
ఇక సుల్తానాకు మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాదత్.. మాట్లాడుకుందామని గురువారం మిట్ట మధ్యాహ్నం బయటకు పిలిచాడు. స్కూటీపై కూర్చొని మాట్లాడుతుండగానే, ఆమెపై సాదత్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ సుల్తానా ప్రాణాలు విడిచింది. కొంచె దూరం వెళ్లిన సాదత్ తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సాదత్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.