ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కానీ ఆ.. భయంతో ఆత్మహత్య
విధాత: వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. వరుసకు బావమరదళ్లు.. ఇంకేముంది తొలి చూపులోనే మనసులు కలిశాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అలా ప్రేమజీవితం సాఫీగా సాగిపోతోంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించక పోవచ్చనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వైజాగ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నకొత్తపేట గ్రామానికి చెందిన కందివలస దామోదర్(20) డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లాలోని ఆముదాలవలస […]

విధాత: వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. వరుసకు బావమరదళ్లు.. ఇంకేముంది తొలి చూపులోనే మనసులు కలిశాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అలా ప్రేమజీవితం సాఫీగా సాగిపోతోంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించక పోవచ్చనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వైజాగ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నకొత్తపేట గ్రామానికి చెందిన కందివలస దామోదర్(20) డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లాలోని ఆముదాలవలస పరిధిలోని బలగం గ్రామానికి చెందిన ఆదపాక సంతోషి కుమారి(17) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే వీరిద్దరూ ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు. వరుసకు బావమరదళ్లు కావడంతో, ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. కానీ కుటుంబ సభ్యుల తిరస్కరిస్తారనే భయం వారిని వెంటాడింది.
దీంతో ఆ ప్రేమజంట.. సోమవారం వైజాగ్ వచ్చి స్థానికంగా ఓ లాడ్జీలో దిగారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లాడ్జీ గదిలోకి వెళ్లిన ఆ జంట, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా బయటకు రాలేదు. గది లోపలి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లాడ్జీ వద్దకు చేరుకుని, ఆ గది తలుపులు పగుల గొట్టి చూడగా, బాత్రూంలోని కిటీకికి వేలాడుతూ కనిపించారు. అయితే సంతోషి కుమారి మెడలో తాళి బొట్టును పోలీసులు గమనించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంగీకరించే వాళ్లం అంటూ పేరెంట్స్ రోదన
దామోదర్, సంతోషి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియదు. వారు తాము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని చెబితే అంగీకరించే వాళ్లమని తల్లిదండ్రులు రోదించారు. చేతికొచ్చిన పిల్లలు ఇంత దారుణానికి పాల్పడుతారని ఊహించ లేదని బోరున విలపించారు. కేవలం భయంతోనే ఆ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.